English   

ఫిల్మ్ జర్నలిస్టులకు చిరంజీవి అభినందనలు.. 

 Chiranjeevi
2020-04-27 11:44:18

తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులను మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు. వాళ్లు చేసిన పని చూసి అభినందించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు వచ్చి రక్తదానం చేసిన ప్రతీ ఒక్క జర్నలిస్టుకు పేరుపేరునా ధన్యావాదాలు తెలిపాడు చిరంజీవి. ఇలాంటి సమయంలో జర్నలిస్టులు ముందుకు రావడం మంచి పరిణామం అన్నాడు చిరు. అంతేకాదు.. వాళ్లకు తన వంతు సాయం ఎప్పుడూ ఉంటుందని చెప్పాడు. జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్ లక్ష్మీనారాయణతో పాటు వైజే రాంబాబు, సురేంద్ర నాయుడు అందర్నీ ఆయన అభినందించారు. వాళ్లు చేస్తున్న పనుల గురించి కూడా వింటున్నానని చెప్పాడు మెగాస్టార్. గతంలో కూడా జర్నలిస్టులను లాక్ డౌన్ కారణంగా ఆదుకునేందుకు ముందుకొచ్చిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోషియేషన్ ను చిరంజీవి ప్రశంసించారు. సినిమా జర్నలిస్టుల కుటుంబం అంతా ఒక్కటే అని నిరూపిస్తూ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ అన్నీ ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే చాలామంది జర్నలిస్టులకు నెలసరి సరిపడా సరుకులతో పాటు కూరగాయలు కూడా అందచేసారు సభ్యులు. మరికొందరికి కూడా ఈ సాయం అందేలా చేస్తున్నారు. లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు కూడా అందరికీ అందరం సాయం చేసుకుందామని చెబుతున్నారు. ఇప్పుడు జర్నలిస్టులు చేసిన సాయాన్ని చిరంజీవి కూడా గుర్తించాడు. ఆయన ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ప్రశంసించారు కూడా. సోదర సమానలైన జర్నలిస్టు మిత్రులు చేసిన కార్యక్రమం గురించి విన్నాను.. అద్బుతంగా అనిపించింది.. ఈ సమయంలో అందరికి తోడుగా ఉందామంటూ ఆయన ట్వీట్ చేసాడు. 
 

More Related Stories