English   

పిల్లో ఛాలెంజ్...మిల్కీ బ్యూటీ అందాలు చూశారా 

 Tamannaah
2020-04-27 12:00:47

ఈ లాక్ డౌన్ జనల జీవితాలను అస్తవ్యస్తం అయ్యాయి. ఒక పక్క తినడానికి తిండి లేక కొందరు ఇబ్బంది పడుతుంటే రోజూ చేసే పని చేయక కొందరు ఇబ్బంది పడుతున్నారు. ఇక మన సెలబ్రిటీల విషయానికి వస్తే హీరోలు తమకు ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ గడుపుతున్నారు. ఇప్పటి వరకు టైం లేక చేయాలనుకుని చేయలేని పనులు అన్నీ చేసేస్తున్నారు. ఇక టాలీవుడ్ మగ సెలబ్రిటీలు అందరూ రియల్ మెన్ ఛాలెంజ్ లు చేస్తున్నారు. ఇక మరోపక్క హీరోయిన్స్ ఏమో పిల్లో ఛాలెంజ్ అనే కొత్త ఛాలెంజ్ తీసుకొని ఫ్యాన్స్ కి సెగలు పుట్టించే పనిలో పడ్డారు. కేవలం వంటికి దిండుమాత్రమే ఉందా అనేలా దిండుతో బాడీని దాచుకుంటూ కుర్రకారు మతిపోగొడుతున్నారు మన భామలు.

మొదట టాలీవుడ్ హాట్ బాంబ్ పాయల్ రాజ్ పుత్ ఎల్లో కలర్ పిల్లోతో అందాలను దాచుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చి హీటు పుట్టించింది. ఇక ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకుని  మిల్కీ బ్యూటీ తమన్నా కూడా వైట్ పిల్లొతో తన అందాలు ఫ్లోర్ మీద పరిచింది. తన అందాలను దిండు వెనుక దాస్తూ కుర్రకారును వెక్కిరించింది. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న సీటీ మార్ సినిమాలో కబడ్డీ కోచ్ గా నటిస్తుంది తమన్నా. ఈ చిత్రం కోసం తెలంగాణ యాస నేర్చుకుంటుంది కూడా. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి త్వరలోనే ఎఫ్ 3 తెరకెక్కించబోతున్నాడు. ఇందులో కూడా తమన్నా ఉండబోతుందని అంటున్నారు.  

More Related Stories