English   

జయం రీమేక్..అది కూడా ఇన్నేళ్ళ తరువాత 

Jayam
2020-04-27 14:21:37

ప్రస్తుతం రీమేక్‌ల సీజన్ నడుస్తోంది. బాషలతో సంబంధం లేకుండా హిట్ అయిన సినిమాలను తెలుగులోకి అనువదించి, తెలుగులో హిట్ అయిన సినిమాలు ఇతర బాషలలోకి రీమేక్ అవుతున్నాయి. అప్పుడెప్పుడో తేజ దర్శకత్వంలో నితిన్, సదా జంటగా నటించిన ‘జయం’ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తేజ డైరెక్షన్‌లో ఆర్పీ పట్నాయక్ సంగీతంతో అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో తమిళంలో రీమేక్ చేశారు. తమిళంలో రవి, సదా జంటగా నటించారు. అక్కడ కూడా సినిమా సూపర్ హిట్టే. ఆ సినిమాతో రవి ఏకంగా జయం రవిగా మారిపోయి స్టార్ హీరో హోదా సంపాదించారు. 

అయితే ఈ సినిమా వచ్చి ఏళ్ళు దాటుతున్నా ఏమాత్రం క్రేజ్ తగ్గలనేదని అంటున్నారు. అందుకే ఈ సినిమాని కన్నడలో ఈ సినిమాను రీమేక్ చేయాలనే యోచనలో ఉన్నారని అంటున్నారు. కన్నడలో ప్రవీణ్‌ కుమార్‌ అనే డాక్టర్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. ఆయనే ఈ ‘జయం’ సినిమాను కన్నడలో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ప్రవీణ్ ఓ డాక్టర్. కానీ యాక్టింగ్‌ అంటే ఉన్న ఇష్టంటో దాదాపు ఏడాది పాటు నటనలో శిక్షణ తీసుకుని ‘జయం’ రీమేక్‌తో కన్నడ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అవ్వాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. ఇప్పటికే రీమేక్ రైట్స్ కొనుకున్నారని ఈ లాక్ డౌన్ అంతా అయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట.

More Related Stories