English   

జెమినీ టీవీకి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా 

 gemini TV
2020-04-27 14:38:13

తెలుగులో ఉన్న టాప్ మోస్ట్ ఎంటర్టైనింగ్ ఛానెల్స్ లో ఎప్పటి నుంచో పక్కాగా టాప్ 3 లో ఒకటిగా ఇప్పటికీ కొనసాగుతున్న ఛానెల్ ఏదయినా ఉందా ? అంటే ఉందనే చెప్పాలి. అదే జెమినీ టీవీ, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ జెమినీ టీవీ (Gemini TV) అనేది సన్ నెట్‌వర్క్ వారికి సంబందించిన తెలుగు టెలివిజన్ ఛానల్ పేరు. ఈ ఛానల్ 9 ఫిబ్రవరి 1995 తేదీన ప్రారంభించారు. దాని ఫౌండర్ పేరు సుబ్రమణియన్ శ్రీనివాసన్ ఆయన మిథున లగ్నంలో పుట్టారు. మిథునాన్ని ఇంగ్లీషులో ‘జెమిని’ అంటారని, తన జన్మ లాగ్నాన్నే తన పందెం గుర్రానికీ పేరు పెట్టారట. జెమిని అన్న పేరుగల ఆ గుర్రం చాలా పందాల్లో నెగ్గి కాసుల వర్షం కురిపించిందట. అందుకే ఆ పేరు తనకి అచ్చివచ్చిందని భావించిన ఆయన ఆ పేరుతోనే తన చేత స్థాపించబడిన స్టూడియోకి పేరు పెట్టారట వాసన్‌.

అలా ఆ సంస్థ నిర్మించిన సినిమాల్లో  అధిక శాతం విజయం సాధించాయి. జెమినిలో ఉన్న ఫిలిం లాబోరెటరీని హైదరాబాద్‌ సారథి స్టూడియో కొని ఆ పేరుతోనే నడిపింది. తర్వాత అందులోని వారే టీవీ ఛానెల్‌ పెట్టారు అదే ఈరోజు జెమినిగా నడుస్తోంది. ఇక ఈ ఛానల్ యొక్క హెచ్ డి వింగ్ కూడా డిసెంబర్ 11 2011 న ప్రారంభం అయింది. ఈ ఛానల్ లో ఎక్కువగా సీరియల్స్, సినిమాలు, రియాలిటీ గేమ్ షోస్ ప్రసారం అవుతాయి. ఇక ఈ సన్ నెట్వర్క్ తెలుగు చానల్స్ లో జెమినీ టీవీ తో పాటు జెమినీ కామెడీ,జెమినీ లైఫ్,జెమినీ మూవీస్,జెమినీ మ్యూజిక్, జెమినీ న్యూస్ చానల్స్ కూడా మొదలు పెట్టినా అందులో సగం ఛానెల్స్ అయితే ఆపేశారు.

More Related Stories