English   

పాయల్ పాప కోరికలు..విజయ్ తో సినిమా..కార్తికేయతో డేటింగ్

Payal Rajput
2020-04-27 17:23:52

అప్పుడెప్పుడో విజయ్ ని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పి రచ్చ రేపిన పాయల్ పాప ఇప్పుడు మరో రచ్చ రేపింది. తాజాగా లాక్ డౌన్ క్రమంలో సోషల్ మీడియాలో నెటిజన్లతో ముచ్చటించిన పాయల్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇప్పటికిప్పుడు మీ మొదటి సినిమా కో స్టార్ కార్తికేయతో డేట్‌ చేసే ఛాన్స్‌ వస్తే ఏం చేస్తారు? అని ప్రశ్నించగా.. ‘కార్తికేయ, నేను మంచి స్నేహితులం. అది చాలు నాకు.’ అని సమాధానం ఇచ్చారు. ఇక మరో నెటిజన్‌ ఏమో ఇప్పటికిప్పుడు ఏ టాలీవుడ్‌ హీరోతో నటించాలని అనుకుంటున్నారు?’ అని అడగ్గా.. ‘విజయ్‌ దేవరకొండ’ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఇంకేముంది దేవరకొండే కావాలంటున్న పాయల్ పాప అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.  

నిజానికి పాయల్ కెరీర్ ఏమంత సక్సెస్ ఫుల్ గా సాగడం లేదు. తెలుగులో ఆమె మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100 అయితే సూపర్ సక్సెస్ అయింది. ఆ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ పాయల్ కి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. గత ఏడాది విడుదలైన వెంకీ మామ ఒక్కటి హిట్ గా నిలిచినా మరో సినిమా ఏదీ ఆమె ఖాతాలో లేదు. ఇక ఇదే ఇన్స్టా సెక్షన్ లో మరికొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా క్రికెటర్లందరిలో విరాట్‌ కోహ్లీ అంటే ఎక్కువ అభిమానమని చెప్పుకొచ్చింది. అలాగే రజనీకాంత్‌ తో నటించే అవకాశం వస్తే కూడా తప్పకుండా చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది. మరి ఆమె కోరికలు అన్నీ ఎప్పటికి తీరతాయో చూడాలి మరి. 

More Related Stories