English   

ఫ్రెండ్ కోసం అల్లు అర్జున్ సాహసం చేస్తాడా ..

Allu Arjun
2020-04-27 17:43:02

ఈ రోజుల్లో అనే చిన్న సినిమాతో దర్శకుడిగా తొలి విజయం అందుకున్న మారుతి తరువాత కాలంలో భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, తాజాగా ప్రతి రోజు పండగే లాంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. మొదటి నుంచి ఈయనికి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అల్లు అర్జున్ తో స్నేహం ఉండడంతో అల్లు శిరీష్ తో కొత్త జంట లాంటి సినిమా చేసి హిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో చాలా ఇంటర్వ్యూల్లో మారుతి వన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌లను డైరెక్ట్‌ చేయడం తన లక్ష్యం అన్నట్లు చెప్పేవాడు. అయితే ప్రతి రోజు పండుగే తర్వాత మారుతి తన తదుపరి సినిమాని  ఇంకా ప్రకటించలేదు. నిజానికి బన్నీ  'నా పేరు సూర్య' సినిమా పూర్తి కాగానే బన్నీతో సినిమా ఫిక్స్ అని మారుతి అనుకున్నాడు. 

అయితే 'నా పేరు సూర్య' ఫ్లాప్ గా నిలిచింది. ఈ మధ్యకాలంలో బన్నీకి అలాంటివి ఫ్లాప్ ఎప్పుడూ తగల్లేదు. దీంతో అల్లు క్యాంప్ డ్యామేజ్ కంట్రోల్ మెజర్స్ లో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో మారుతి సినిమాను తేజూతో జీఏ2 బ్యానర్లో  సెట్ చేశారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం మారుతీ ఒక స్క్రిప్ట్‌ను రెడీ చేశాడని, అది బన్నీకి అయితే బాగా సూట్‌ అవుతుందని సమాచారం. అయితే ఇంకా బన్నీకి చెప్పలేదు కానీ అయితే ఒకవేళ నచ్చినా బన్నీ సాహసం చేస్తాడా అనేది చూడాలి. ప్రస్తుతం బన్నీ పుష్ప చిత్రంకు రెడీ అవుతున్నాడు. 

More Related Stories