English   

నితిన్ సరసన నాని హీరోయిన్ 

 Priyanka Arul Mohan
2020-04-28 12:44:39

కుర్ర హీరో నితిన్‌ ప్రస్తుతం వరుస సినిమాలు అనౌన్స్ చేసి మంచి ఫాంలో ఉన్నాడు. తాజాగా భీష్మతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో భీష్మతో పాటే వెంకీ అట్లూరి, చంద్రశేఖర్‌ యేలేటి, కృష్ణ చైతన్యలతో సినిమాలు కూడా ఓకే చేశాడు. ఇక తాజాగా ఆయన మేర్లపాక గాంధీతో ‘అంధాదున్‌’ రీమేక్‌ కూడా పట్టాలెక్కించాడు. మొన్నామధ్య పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది కూడా. అయితే లాక్‌డౌన్‌ కారణంగా రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం జరగడం లేదు. ఇక ఈ సినిమాలో విలన్‌ ఓ లేడీ. మాతృకలో ఈ పాత్రను టబు అద్భుతంగా నటించింది. అందుకే ఇప్పుడు తెలుగు రీమేక్‌లోనూ ఆ పాత్రను ఆమెతోనే చేయించాలని నితిన్ సినిమా యూనిట్ కూడా ప్రయత్నించినట్లు అయితే రేమ్యునరేష్ కుదరక వదిలేశారని కూడా అన్నారు. అయితే ఆ విషయం అలా ఉంచితే తాజాగా ఈ చిత్రంలో నితిన్‌ సరసన నటించే నాయిక గురించి ప్రచారం సాగుతోంది. ‘గ్యాంగ్‌ లీడర్‌’ ఫేం ప్రియాంక అరుళ్‌ మోహన్‌ ను ఎంపిక చేసే ఆలోచనలో యూనిట్ ఉందని అంటున్నారు. అందుకు సంబందించిన చర్చలు కూడా సాగుతున్నాయని సమాచారం. కొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. 

More Related Stories