English   

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో మరో హీరో 

 NTR
2020-04-28 12:58:49

యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎన్టీఅర్ తదుపరి సినిమా ఉంబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధా కృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. రకరకాల పేర్లు అయితే వినిపిస్తూ వచ్చాయి కానీ ఎవరి పేరును ఇంకా ఫైనల్ చేయలేదు. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌ లో ప్రచారం జరుగుతోంది. అదేంటంటే ఈ సినిమాలో యంగ్ &స్టైలిష్ బిజినెస్మ్యాన్ గా ఎన్టీఆర్ కనిపిస్తారని అంటున్నారు.

 అంతేకాక ఈ సినిమా గురించి లేటెస్ట్ గాసిప్ ఏమిటంటే, ఈ సినిమాలో మరో హీరో కీలక పాత్రను పోషించబోతున్నాడట. అయితే ఆ హీరో ఎవరనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. త్రివిక్రమ్‌ గతంలో తెరకెక్కించిన ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ సినిమాల్లో కూడా ఆది పినిశెట్టి, నవీన్‌ చంద్ర, సుశాంత్‌ లాంటి హీరోలు కీలక పాత్రలు పోషించారు. ఎలా అయితే ఆ సినిమాల్లో వారి పాత్రలు ఉంటాయో ఈ సినిమాలో కూడా మరో హీఎరో పాత్ర ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక ‘ఎన్టీఆర్‌ 30’ మొదలవుతుంది. ఇక ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని అలాగే ఆ ఇద్దరి ప్లేస్ లో రకరకాల పేర్లు కూడా ప్రచారం అవుతున్నాయి.

More Related Stories