English   

విజయ్ దేవరకొండ బిజినెస్ లు ఏమేమిటో తెలుసా 

Vijay Devarakonda
2020-04-28 13:24:35

టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ఇప్పుడు బాలీవుడ్ మీద ద్రుష్టి సారిస్తున్నాడు. అయితే డబ్బు సంపాదిస్తూ దానిని దాచుకోకుండా వ్యాపార రంగంలో కూడా పెట్టి విజయవంతంగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 'రౌడీ' పేరుతో దుస్తుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. తాజాగా ఇప్పుడు మరో బిజినెస్ ప్రారంభించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యనే నిర్మాతగా మారిన విజయ్ ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ కాబోతున్నాడని కూడా ప్రచారం జరిగింది. అయితే విజయ్ రెస్టారెంట్ బిజినెస్ కూడా చేస్తున్నాడట. అయితే ఇది ముందు ఎప్పుడూ ప్రచారం జరగలేదు. ఇ

క ఆయన ఏషియన్ సినిమాస్ తో తన సొంత ఊరి మహబూబ్ నగర్ లో తొలి మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేయనున్నాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇప్పటికే మహేష్ బాబు అదే ఏషియన్ సినిమాస్ వారి సహకారంతో AMB సినిమాస్ పేరుతో, మరోవైపు ప్రభాస్..తన మిత్రుడు వంశీ, ప్రమోద్‌లతో కలిసి నెల్లూరులో దేశంలోనే అతిపెద్ద ‘వీ ఎపిక్’ పేరుతో మల్టీప్లెక్స్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా వీళ్లిద్దరి బాటలో విజయ్ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లో ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడన్న మాట. అలా మొత్తంగా రెస్టారెంట్, డిజిటల్ బాడీ వేర్, థియేటర్స్ బిజినెస్ లు ప్రస్తుతం చేస్తున్నాడు దేవరకొండ.

More Related Stories