English   

పాపం వంశీ పైడిపల్లి ఇలా ఇరుక్కుపోయాడేంటి..

 Vamshi Paidipally
2020-04-28 15:05:35

రెండు నెలల కింది వరకు కూడా చేతిలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఉందనే ధైర్యంతో కనిపించిన దర్శకుడు వంశీ పైడిపల్లి ఇప్పుడు డీలా పడిపోయాడు. ఉన్నట్లుండి ఈ చిత్రం ఆగిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక డైలమాలో పడిపోయాడు ఈ దర్శకుడు. లూసిఫర్ రీమేక్ బాధ్యతలు తీసుకుంటాడని వార్తలు వినిపించినా కూడా ఇప్పుడు ఆ అవకాశం సుజీత్ కు ఇచ్చాడు మెగాస్టార్. ఉన్నట్టుండి మహేష్ బాబు సినిమా చేజారిపోవడం.. అనుకున్న చిరంజీవి సినిమా మరో దర్శకుడికి వెళ్ళిపోవడంతో వంశీ పైడిపల్లి ఒక్కసారిగా ఖాళీ అయిపోయాడు. ఇప్పటికిప్పుడు ఓ కథ సిద్ధం చేసుకొని ఎవరో ఒక హీరో ఒప్పించే పనిలో బిజీ అయిపోయాడు ఈ దర్శకుడు. 

అయితే వంశీ పైడిపల్లి చెప్పే కథలు వినడానికి స్టార్ హీరోలు కూడా ఎవరూ కాళీగా లేరు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్ సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చాడు. అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ ఒక్కడే నెక్స్ట్ ఏంటో తెలియకుండా ఉన్నాడు. దాంతో ఆయన్నే ఎలాగైనా పట్టాలని చూస్తున్నాడు వంశీ పైడిపల్లి. కానీ ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి ఎంత వరకు ఆసక్తి చూపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. 

గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన ఎవడు సినిమా విజయం సాధించింది. ఆ పరిచయంతోనే రామ్ చరణ్ వైపు వంశీ అడుగులు పడుతున్నాయని ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సెకండ్ గ్రేడ్ హీరోలను పట్టుకోవడం తప్ప వంశీ పైడిపల్లి మరో ఆప్షన్ కూడా కనిపించడం లేదు. రవితేజ, నితిన్, విజయ్ దేవరకొండ, రామ్ ఇలాంటి హీరోలతోనే ఈయనకు ఇప్పుడు వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. మరి ఈ దర్శకుడు ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. 

More Related Stories