English   

తేజతో అమెజాన్ ప్రైమ్ బడా డీల్

Amazon Prime
2020-04-28 15:14:59

కెరీర్ మొదటి నుండి డిఫరెంట్ స్టోరీలతో హిట్స్ కొట్టాడు డైరక్టర్ తేజ. డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా ‘చిత్రం’ నుండి మొన్నటి సీత దాకా చాలా సినిమాలు చేసి హిట్స్ కొట్టాడు. ఇక ఆయన చేసిన ‘నువ్వు నేను’ సినిమాకే ఆరు నంది అవార్డులు వచ్చాయంటేనే అర్ధం చేసు కోవచ్చు. అయితే చాలా కాలం తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా హిట్ తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘సీత’ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి అది వేరే విషయం. ఇక ఆయన ఇప్పుడు మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టినట్టు చెబుతున్నారు. రానాతోనే మరో సినిమాను చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడని ఆయనే క్లారిటీ ఇచ్చారు. మరో వైపున గోపీచంద్ హీరోగా మరో సినిమా చేయడానికి కూడా ఆయన రెడీ అవుతున్నారు. ఆ సినిమాకి ‘అలివేలు వెంకటరమణ’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడట. అయితే అందుతున్న సమాచారం మేరకు తేజతో ఆమెజాన్ ప్రైమ్ ఒక డీల్ కుదుర్చుచుకునే పనిలో ఉందట. అదేంటంటే తేజను తమకు సినిమాలు చేసిపెట్టమని ఆమెజాన్ కోరిందట. రెండు సినిమాలు, మూడు వెబ్ సిరీస్ చేసిమ్మని ఆయనని కోరారట. ఆమెజాన్ తెలుగు కంటెంట్ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాలని చూస్తున్న క్రమంలో తేజను అప్రోచ్ అయినట్టు చెబుతున్నారు. అయితే దాదాపుగా ఈ డీల్స్ క్లోజ్ అయ్యే స్టేజ్ లో ఉన్నాయని అంటున్నారు. అయితే మనం అధికారిక ప్రకటన కోసం వేచి చూడక తప్పదు. 

More Related Stories