ఇర్ఫాన్ ఖాన్‌కు అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

ప్రముఖ బాలీవుడ్ ఇర్ఫాన్ ఖాన్ ఈ మధ్య మళ్ళీ వార్తల్లికి వచ్చారు. మొన్ననే ఆయన తల్లి సయిదా బేగం రాజస్థాన్‌లో కన్నుమూశారు. ఆమెను కడసారి చూపుకు కూడా నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇర్ఫాన్ ఆరోగ్యం గురించిన సమాచారం ఏదీ అధికారికంగా వెల్లడించలేదు. నిజానికి గతంలో ఇర్ఫాన్ ఖాన్ కాదు న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ బారిన పడ్డా కూడా కొన్ని నెలల చికిత్స అనంతరం కోలుకన్న ఆయన మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా ఇర్ఫాన్ ఖాన్ నటించిన అంగ్రేజీ మీడియం చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినా లాక్డౌన్ ఎఫెక్ట్‌తో అది పెద్దగా ఎక్కడా ఆడలేదు. ఇక ఈయన తెలుగులో మహేష్‌బాబు నటించిన ‘సైనికుడు’ చిత్రంలో పప్పు యాదవ్ పాత్రలో నటించి మెప్పించాడు. అలా తెలుగు వారికి కూడా ఈయన బాగా దగ్గరయ్యాడు.