English   

మళ్ళీ నాని సరసన అను ఇమ్మానుయేల్

 Anu Emmanuel
2020-04-29 09:50:01

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు ప్రకటించారు. నాని హీరోగా మరో ‘వీ’సినిమా తన అభిమానుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత ఆయన టక్ జగదీశ్ ఆ తరువాత శ్యామ్ సింగ రాయ్ సినిమాలు ను చేసేందుకు రెడీగా ఉన్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ షూట్ మధ్యలో ఆగింది. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఆ సినిమా తరువాత  'జెర్సీ' వంటి సూపర్ హిట్ సినిమాని నిర్మించిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ టాక్సీ వాలా వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు 'రాహుల్ సాంకృత్యన్' దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక  ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కి అవకాశం ఉందని అంటున్నారు. ఈ లిస్టు లో ఒకరిగా అను ఇమ్మానుయేల్ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెతో సంప్రతింపులు జరుగుతున్నాయని, త్వరలోనే స్పష్టత రావొచ్చని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో వీరు ఇద్దరూ మజ్ను సినిమాలో కలిసి నటించారు. అహి ఆమెకు తోలి తెలుగు సినిమా. ఇక ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ కుదిరెందుకు పెద్దగా వర్కౌట్ కాలేదు. మరి చూడాలి ఈ సినిమాలో ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటారో. ఇక అల్లుడు అదుర్స్‌ చిత్రంతో బిజీగా ఉంది అను. 

More Related Stories