English   

పరశురామ్ రాసిన కథలో మహేష్ మార్పులు...ఎందుకంటే 

 Mahesh
2020-04-29 09:59:51

ఈ ఏడాది మొదట్లోనే సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు మహేష్ బాబు. అయితే మళ్ళీ తన తదుపరి సినిమాని తనకు మహర్షి వంటి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో చేస్తున్నాడని ముందే క్లారిటీ ఇచ్చినా అది ఎందుకో కానీ కార్యరూపం దాల్చలేదు. అయితే తరువాత అనూహ్యంగా మహేష్ పరశురామ్ కాంబినేషన్ సినిమా ఒకటి తెర మీదకు వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ సినిమా గురించి రకరకాల గాసిప్స్ మాత్రం తిరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. 

అదేంటంటే ఆ సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే మొత్తం పూర్తి అయ్యాయి. అయితే ఈ సినిమా విషయంలో మహేష్ మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నారని అంటున్నారు. అంటే సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ కోసం ఇప్పటికే ఒక వర్షం పరశురామ్ ప్రిపేర్ చేయగా ఇప్పుడు వాటికి వేరే మరోక వెర్షన్స్ రాయమని అడిగాడట. దీంతో ఆయన మహేష్ బాబుకి నచ్చినట్లుగా కథలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముందు ఈ సినిమా యూఎస్ బ్యాక్ డ్రాప్ లో తెరకేక్కించాలని అనుకున్నారట. అయితే కరోనా కారణంగా అమెరికా కాదు కదా మరే ఫారెన్ కంట్రీలో కూడా ఎవరు కాలు పెట్టలేని పరిస్థితి. అందుకే ఆ షెడ్యూల్స్ ని కూడా క్యాన్సిల్ చేశారట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. వీలయితే యూఎస్ లో చేయడం లేదంటే కధ మొత్తం మార్చే యిచన కూడా చేస్తున్నట్టు చెబుతున్నారు.  

More Related Stories