English   

నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి..విషాదంలో చిత్ర పరిశ్రమ..

 Irrfan Khan
2020-04-29 13:07:18

మొన్నటి వరకు విచిత్రమైన వ్యాధితో పోరాడి మొన్ననే తన తల్లిని పోగొట్టుకున్న నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించారు. ఆయన వయసు 54.  పెద్ద పేగు సంబంధిత వ్యాధి సోకడంతో, ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయన చికిత్స కోసం జాయిన్ అయ్యారు. అయితే మొన్ననే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం న్ను మూసింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో మాధ్యమం ద్వారా వీక్షించి ఎంతో తల్లడిల్లిపోయాడు. అయితే కన్నతల్లి  కనుమూసి నాలుగైదు రోజులు కాకున్నా ఆయన ఆరోగ్యం విషమించింది. ఆయనకు డాక్లర్టు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినపటికి ఆయన కోలుకోలేదు. ఆయనకు భార్య సుతాపా సిక్దర్, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

గతంలో న్యూరోఎండోక్రిన్ ట్యూమర్’ అనే అతిఅరుదైన క్యాన్సర్‌ కారణంగా లండన్‌లో చికిత్స్ తీసుకున్నాడు. ఆయన ఆ వ్యాధి నుండి కోలుకుని ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. అయితే ఈ ట్యూమర్ వచ్చినప్పుడే అప్పట్లోనే ఇర్ఫాన్ ఖాన్ నేను బతికేది కొన్ని రోజులే అంటూ అప్పట్లో ఓ వీడియో విడుదల చేయడం సంచలనం సృష్టించింది. తన నటనతో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కాలు అందుకున్న ఈయన తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించారు. పప్పు యాదవ్ పాత్రలో నటించిన ఆయనను తెలుగు ప్రేక్షకులు ఎవరూ మర్చిపోలేరు. ఆయన మరణంతో బాలీవుడ్ లో విషాద చాయలు అలుముకున్నాయి.   
 

More Related Stories