English   

ఇర్ఫాన్ ఖాన్ అంత్యక్రియలు ఎక్కడ.. పరిస్థితేంటి.. 

Irrfan Khan last rites
2020-04-29 14:32:15

ఇంతకంటే దారుణం.. విషాదం ఇంకోటి ఉండదేమో.. తల్లి చనిపోయి నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే కొడుకు కూడా చనిపోయాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో బాధ పడుతూ చనిపోయాడని తెలుసుకున్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భిన్నమైన సినిమాలు చేసే ఆయన్ని అందరు హీరోల అభిమానులు కూడా ఇష్టపడతారు. ముఖ్యంగా ఇర్ఫాన్ ఖాన్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మూడేళ్ల కింద ఈయన అరుదైన వ్యాధితో బాధ పడుతూ లండన్ వెళ్లాడు. అక్కడే ఏడాదికి పైగానే ఉండి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత కోలుకుని ఇండియాకి వచ్చాడు. వచ్చిన తర్వాత సినిమాలు కూడా చేసాడు ఇర్ఫాన్. అయితే అనుకోకుండా మళ్లీ రెండు రోజుల కింద అనారోగ్యానికి గురి కావడంతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి పంపించారు. చేర్చిన రోజు నుంచి ఐసియూలోనే ఉన్న ఇర్ఫాన్ ఇప్పుడు మరణించారు. 

అయితే ఈయన అంత్యక్రియలు ఎక్కడ.. ఎలా జరుగుతాయనడంలో ఆసక్తి నెలకొంది. తన తల్లి అంత్యక్రియలను కూడా అతడు వీడియో కాల్ లోనే చూసాడు. ఇప్పుడు ఇర్ఫాన్ ఇలా ఆకస్మాత్తుగా కన్ను మూయడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆయన మృతితో బాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇర్ఫాన్ అంత్యక్రియలకు బాలీవుడ్ స్టార్స్ ఎంతమంది వస్తారనేది కూడా అనుమానంగా మారుతుంది. ఎందుకంటే లాక్ డౌన్.. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆయన ఫ్యూనరల్ సింపుల్ గా చేయాలనుకుంటున్నారు. అయితే ఇంత పెద్ద నటుడిని అలా సింపుల్ గా కడసారి చూపులు కూడా లేకుండా సాగనంపడం అనేది సరికాదంటున్నారు బాలీవుడ్ స్టార్స్. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..? 

More Related Stories