English   

ఇర్ఫాన్ ఖాన్ లేకపోయినా ఆ సినిమాలు ఎప్పుడూ ఉంటాయి..

Irrfan Khan
2020-04-29 15:03:14

ఆయన సూపర్ హీరో కాదు.. అందరిలా డాన్సులు చేయడు.. సూపర్ స్టార్ కూడా కాదు.. కానీ ఏ సూపర్ స్టార్ కు కూడా ఆయన తక్కువ కాదు. అభిమాన సంఘాలు లేకపోయినా కూడా అందరి అభిమానులు కూడా ఆయన వెంటే ఉంటారు. విభిన్నమైన కథలు.. సినిమాలు చేయాలంటే బాలీవుడ్ అంతా చూసేది ఒక్కరి వైపే అతడే ఇర్ఫాన్ ఖాన్. ప్రయోగాత్మక కథ ఉంది అంటే ఏ దర్శకుడికైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు ఇర్ఫాన్‌ ఖాన్. గత పదేళ్లలో బాలీవుడ్ లో ఆయన చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేయలేదు.. ఆయన సినిమాలు తెచ్చుకున్నంత ప్రశంసలు మరే సినిమాలకు సాధ్యం కాలేదు. 

చివరగా ఆయన నటించిన అంగ్రేజీ మీడియం కూడా ఇప్పుడు డిజిటల్ లో మంచి టాక్ తెచ్చుకుంది. లాక్ డౌన్ ముందు విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ లో బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఈయన సేవలను గుర్తించిన కేంద్రం 2011లో పద్మశ్రీ అవార్డు ఇచ్చారు.. 30 ఏళ్ల కెరీర్‌లో ఓసారి జాతీయ పురస్కారం.. 4 సార్లు ఫిలింపేర్ అవార్డులు అందుకున్నాడు ఇర్ఫాన్. కొన్నేళ్ళలో లైఫ్ ఆఫ్ పై.. ది లంచ్ బాక్స్.. తల్వార్.. హిందీ మీడియం.. ఆన్.. బ్లాక్ మెయిల్.. ఖరీబ్ ఖరీబ్ సింగిల్.. మదారి.. ఇంగ్లీష్ మీడియం.. పీకూ.. పాన్ సింగ్ తోమర్.. న్యూ యార్క్ లాంటి ఎన్నో సినిమాలు చేసాడు. ఇవన్నీ ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాలు కూడా అందుకన్నాయి. ఇఫ్పుడు భిన్నమైన కథలకు ఎవరూ తోడు అంటూ అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.

More Related Stories