ఆ బోల్డ్ పాత్ర చేసి తప్పు చేశా...రాశి షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న బిజీ హీరోయిన్స్ లో రాశిఖన్నా ఒకరు. వరుస ఛాన్సులు రావడమే కాక అవన్నీ హిట్ కావడంతో అవన్నీ అమ్మడిని బిజీ హీరోయిన్ గా నిలబెట్టాయి. వెంకీ మామ, ప్రతి రోజు పండగే చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న ఈ భామ గతంలో ఎన్నడూ చేయని విధంగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఒక బోల్డ్ పాత్రలో నటించి అందర్నీ ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఒకరకంగా ఆమెను అప్పటివరకు ఇష్టపడిన ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఈమె చేసిన ఆ పాత్ర దెబ్బకు ఛీ కొట్టారు. దీంతో మరోసారి అలాంటి తప్పు చేయనని చెబుతోంది ఈ బ్యూటీ. నిజానికి రాశి ఖన్నా వెండితెరపై గ్లామర్‌గా కనిపించేందుకు ఎప్పుడూ వెనకాడ లేదు. నిజానికి అంతకు ముందు కొన్ని గ్లామరస్ పాత్రలు కూడా చేసింది.
అయితే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా హిట్ అయితే తనకు అవకశాలు పెరగడమే కాక స్టార్ హోదా వస్తుందని సినిమా చేసింది. అయితే ఇప్పుడు విషయం అర్ధం అయ్యాక వరల్డ్ ఫేమస్ లవర్ లో బోల్డ్ రోల్ చేసి తప్పు చేశానని పేరెంట్స్ ని కూడా ఇబ్బంది పెట్టానని, భవిష్యత్ లో అలాంటి పాత్రలు చేయనని, గ్లామర్ రోల్స్ చేసినా హద్దులు దాటనని చెప్పుకొచ్చింది రాశి. నిజానికి విజయ్‌తో రోమాంటిక్ సీన్ ఉందని అమ్మా, నాన్నలకు చెప్తే కంగారు పడ్డారని అయితే అది ఒక క్యారెక్టర్లా మాత్రమే చూడమని పట్టించుకొవ్వదని చెప్పానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక పై పాత్రల ఎంపికలో చాల జాగ్రత్తగా ఉంటానని ఆమె చెప్పుకొచ్చింది.