రియల్ మ్యాన్ ఛాలెంజ్ లో చిరు ఫెయిల్ .. నిరాశలో అభిమానులు

ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ చేసిన బీ ద రియల్ మ్యాన్ సవాల్‌ని స్వీకరిస్తున్నట్టు ట్వీట్ చేసి, నీ సవాలు స్వీకరించానని పేర్కొన్నారు. అన్నట్టుగానే ఆయన దానికి సంబందించిన వీడియోని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ముందుగా లాక్ డౌన్ కారణంగా ఇంట్లో పనిమనుషులు రాక పోవడంతో ఇంట్లో ఆడవారికి సాయంగా ఉండాలనీ.. ఎవరైతే ఈ కష్టకాలంలో ఆడవారికి తోడుగా ఉంటారో వారే అసలైన మగవారని చెబుతూ సందీప్ రెడ్డి ఓ వీడియోను షేర్ చేస్తూ రాజమౌళికి మొదటగా ‘బి ది రియల్ మెన్ ఛాలెంజ్’ విసిరాడు. అక్కడి మొదలయిన ఈ ఛాలెంజ్ రాజమౌళి టు ఎన్టీఆర్, ఎన్టీర్ టు చిరంజీవికి చేరింది.
తాజాగా చిరంజీవి కూడా ఇంటిని వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేసి..తన తల్లి గారైన అంజనమ్మకు ఇంట్లో దోశలు వేసి పెట్టి కొడుకుగా తల్లిపై తన ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు బి ది రియల్ మెన్ ఛాలెంజ్ కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు మణిరత్నంను చిరంజీవి నామినేట్ చేసారు. అయితే అదే ఇప్పుడు ఆయన కొంప ముంచిందని అంటున్నారు ఆయన అభిమానులు. ఎందుకంటే చిరంజీవి ఈ ఛాలెంజ్ విసిరి రోజులు గడుస్తున్నా ఈ ముగ్గురిలో ఎవరు స్పందించక పోవడంతో మెగాస్టార్ ను ఈ ముగ్గురూ లైట్ గా తీసుకున్నారా అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం గమనార్హం..అయితే మిగతా ఇద్దరి సంగతి పల్లన పెడితే కి చిరంజీవి రజినీకాంత్ లు మంచి స్నేహితులు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య బయటపడని ఎదో గ్యాప్ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది.
దీనికితోడు గత సంవత్సరం చెన్నైలో జరిగిన 'సైరా' ప్రమోషన్ ఈవెంట్ కు అతిధిగా రమ్మని ఆహ్వానించినా రజినీకాంత్ రాకపోవడంతో వీరిద్దర్కీ పడట్లేదు అనే ప్రచారం మొదలయింది. ఇక మణిరత్నం విషయానికి వస్తే ఆయన భార్య సుహాసిని చిరంజీవి మంచి స్నేహితులు. అయితే కొంత కాలం క్రితం మణిరత్నం స్వయంగా చిరంజీవి ఇంటికి వచ్చి చరణ్ తో ఒక సినిమా తీయాలని కోరితే చరణ్ సానుకూలంగా స్పందించ లేదట. అందుకే ఆయా విషయాలు మనసులో పెట్టుకుని బహుశా చిరంజీవి సవాల్ కు రజినీకాంత్, మణిరత్నం లు స్పందించి ఉండరు అన్న ప్రచారం జరుగుతోంది.
ఇక కెటీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో కరోనాను కట్టడి చేసే కార్యక్రమాల బిజీలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన ఇలాంటి వీడియోలు చేసి పెదిత్జే జనాల్ల్లోకి వెళుతుంది కాబట్టి ఆయన కూడా లైట్ తీసుకుని ఉండచ్చని అంటున్నారు. ఇప్పుడు చిరు అభిమానులు అందరూ ఈ విషయం మీద ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.