English   

మరో రికార్డు కొట్టిన సరిలేరు నీకెవ్వరు

Mahesh
2020-04-30 10:00:07

అనీల్ రావిపూడి ద‌ర్శక‌త్వంలో మ‌హేష్ బాబు హీరోగా సంక్రాంతికి రిలీజయి అనేక రికార్డులు సొంతం చేసుకున్న సినిమా స‌రిలేరు నీకెవ్వరు. ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో విజ‌యశాంతి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఏకంగా 145 కోట్లకి పైగా షేర్ రాబ‌ట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ.121 కోట్ల షేర్ వసూలు చేసిందంటే ఈ సినిమా ఎలా జనాన్ని ఆకట్టుకుందో చెప్పకర్లేదు. అయితే ఈ సినిమా కొత్తగా మరో రికార్డు బద్దలు కొట్టింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లామర్ ని పొగుడుతూ హీరోయిన్ రష్మిక పాడే ‘హీ ఈజ్ సో క్యూట్’ సాంగ్ లిరికల్ వీడియోకి నిన్నటితో యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ అందుకుంది. ప్రముఖ గీత రచయిత శ్రీ మణి కలం నుంచి జాలు వారిన ఈ పాటను మధు ప్రియ పాడింది. ఇక ఈ క్రమంలో తమ హీరో పాటకు ఇన్ని వ్యూస్ రావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్, సినిమా యూనిట్ కి, ప్రత్యేకంగా సంగీత దర్శకుడు దేవికి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తోపాటు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన ఇందులోని సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.

More Related Stories