బాలీవుడ్ లో మరో విషాదం...సీనియర్ హీరో మృతి

బాలీవుడ్ నిన్నటి విషాదానికే కోలుకోలేదు, ఈరోజు మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హిందీ నటుడు రిషికపూర్ (67) అనారోగ్యంతో ఈరోజు కొద్ది సేపటి క్రితం మరణించారు. నిన్న ఆయన అనారోగ్యానికి గురవడంతో రాత్రి ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజులుగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అంతేకాకుండా శ్వాస సంబంద సమస్య కూడా ఉండటంతో దానికి సంబందించిన చికిత్స కూడా తీసుకుంటున్నారు. అయితే కొన్నాళ్ళగా నిలకడగా ఉన్న ఆయన ఆరోగ్యం బాగోక పోవడంతో ఆయన్ను ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో రిషి కపూర్ ఈ ఉదయం మరణించారు. రిషి కపూర్‌కు 2018లో క్యాన్సర్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓ సంవత్సరం ఉండి మరీ చికిత్స తీసుకున్నారు. ఇక రిషి కపూర్ చివరిగా తాప్సీ నటించిన ముల్క్ అనే సినిమాలో నటించాడు. ఇక హిందీ యువ హీరో రణ్ బీర్ కపూర్ తండ్రే ఈ రిషికపూర్అనే సంగత అందరికీ తెలిసిందే.