పుష్పలో స్పెషల్ సాంగ్ చేయనున్న బాలీవుడ్ భామ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పుష్ప అనే పేరు కూడా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ నీ మొన్న బన్నీ పుట్టిన రోజున రిలీజ్ కూడా చేశారు. ఇక ఈ పోస్టర్స్ ప్రేక్షకులలో ఒక రకమైన అంచనా పెంచేశాయి. ఈ సినిమా బన్నీ లారీ డ్రైవర్ అని ముందు నుండి ప్రచారం జరిగింది. అయితే గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపించనున్నాడని ఈ పోస్టర్ తో క్లారిటీ వచ్చింది.
అయితే ఈ సినిమాని బన్నీ కెరీర్ లో మొదటిసారిగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో అంటే ప్యాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో సౌత్, నార్త్ ఇండస్ట్రీకి సంబంధించి పలువురు ప్రముఖులని ఎంపిక చేశారని అంటున్నారు. ఈ సినిమా నుండి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తప్పూన్నరని ఆయన ప్లేస్ లో బాబీ సింహాని తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద యూనిట్ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా మరో హీరోయిన్ గా నివేదా థామస్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని ఇందులో నర్తించడానికి దిశా పటానీని యూనిట్ సంప్రదించనుందని సమాచారం. ఈ సినిమాకి సంగీతం అందించేది దేవిశ్రీ ప్రసాద్ కావడం అది కాకా సుక్కూతో గతంలో చేసిన ‘రంగస్థలం’ చిత్రంలోని ఐటెమ్‌సాంగ్ బాగా పాపులర్ కావడంతో మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో గట్టిగానే ప్లాన్ చేయాలనీ చూస్తున్నారు. ఇక దిశా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘లోఫర్’ చిత్రంతో వరుణ్ తేజ్‌తో కలిసి కనువిందు చేసింది. ఇప్పుడు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందన్న మాట.