English   

రామ్ హిందీలోనూ దూసుకెళ్తున్నాడు...ఇస్మార్ట్ గా

Ram pothineni
2020-04-30 12:38:51

ఈ మధ్య తెలుగు సినిమాలకి బాలీవుడ్ లో మంచి ఆదరణ లభిస్తోంది. కొన్ని సినిమాలని రీమేక్ చేస్తుండగా మరికొన్నిటిని మాత్రం హిందీ డబ్బింగ్ చెప్పించి డిజిటల్ ఫ్లాట్ ఫాంలలో విడుదల చేస్తున్నారు. ఈ మధ్యన ఇక తాజాగా రామ్ నటించిన మూడు సినిమాలు యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ సాధించి అద్భుతమైన రికార్డు సొంతం చేసుకున్నాయి. రామ్ నటించిన నేను శైలజ హిందీలో (సూపర్ ఖిలాడీ3), హలో గురు ప్రేమ కోసమే హిందీలో దందార్ ఖిలాడీ, ఉన్నది ఒక్కటే జిందగీ హిందీలో నెంబర్ 1 దిల్వాలా సినిమాలు డబ్బింగ్ అయ్యాయి. ఇక వాటితో ఇప్పటికే ఈ మూడు సినిమాలతో 100 మిలియన్లకు పైగా యూట్యూబ్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. 

నిజానికి యూట్యూబ్ లో తమిళం నుండి ధనుష్, తెలుగు నుండి సైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాలు మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుండగా ఇప్పుడు రామ్ సినిమాలు కూడా మిలియన్ల వ్యూస్ తో దూసుకుతున్నాయి. ఇక రామ్ ఈ మధ్య పూరీ తో కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కూడా హిందీలో రీమేక్ చేయనున్నారని ప్రచారం కూడా జరిగినా దానిని ఇప్పటికే డబ్బింగ్ వర్షన్ యూ ట్యూబ్ లో రిలీజ్ చేశారు,  హిందీ వెర్షన్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ను 2020 ఫిబ్రవరి 16న అప్‌లోడ్‌ చేయగా 100మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక చాలా తక్కువ కాలంలోనే ఇంతటి ప్రేక్షకాదరణ పొంది మరో మార్క్‌ వద్దకు దూసుకెళ్తోంది ఈ సినిమా.

More Related Stories