English   

ఆలయాల మీద జ్యోతిక సంచలన వ్యాఖ్యలు

Jyothika
2020-04-30 12:52:44

హిందూ ఆలయాలకు సంబంధించి సినీనటి, స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆలయాల తరహాలోనే ఆసుపత్రులు, పాఠశాలలను అభివృద్ది చేయాలంటూ గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై కొందరు విమర్శలు గుప్పిస్తుండగా, మరికొందరు ఆమెను వెనకేసుకు వస్తున్నారు. గత మార్చ్ లో జరిగిన ఓ అవార్డ ఫంక్షన్లో జ్యోతిక కామెంట్స్ వివాదానికి మూలమయ్యాయి. మనం ఆలయాలను బాగా శుభ్రం చేస్తాం, పెయింట్ వేస్తాం, బాగా మెయింటైన్ చేస్తాం, ఆలయ హుండీలో డబ్బులు వేస్తాం. దయచేసి అవే డబ్బులు హాస్పిటల్స్‌ కు పెట్టండి, పాఠశాలల అభివృద్ధికి వాడండి. ఇది చాలా ముఖ్యమని జ్యోతిక ఆ వేదికపై అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ వ్యాఖ్యలపై కొందరు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. జ్యోతిక హిందూ ఆలయాలనే ఎందుకు అంటున్నారు? ఇతర మతాల మందిరాలపై ఎందుకు వ్యాఖ్యలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే తన భార్య చేసిన వ్యాఖ్యలను హీరో సూర్య సమర్థించారు. ఆలయాలపై జ్యోతిక చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నామని చెప్పారు. పాఠశాలలు, ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ బహిరంగలేఖ కూడా విడుదల చేశారు. అయితే, జ్యోతిక కుటుంబం గతంలో కూడా ఇలాగే మాట్లాడిందని కొందరు విమర్శిస్తుంటే, ఈ విషయంలో జ్యోతికకు ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది మద్దతు పలుకుతున్నారు. జ్యోతిక మాట్లాడిన దానిలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.

More Related Stories