English   

మన స్టార్ హీరోలకు ఆ విషయం నచ్చలేదా..

Prabhas Mahesh
2020-04-30 13:24:19

సోషల్ మీడియాలో చాలెంజ్ లు ఎక్కువయ్యాయి. కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అందరూ ఇళ్ళకి పరిమితం కావడంతో సోషల్ మీడియాలోనే కాలం గడుపుతున్నారు. దీంతో కొన్ని చాలెంజ్ లు నడుస్తున్నాయి. అందులో సెలబ్రిటీల వరకూ ముఖ్యమైంది ఏంటంటే పిల్లో ఛాలెంజ్. అంటే ఒంటి మీద అబట్టలు ఏమీ లేకుండా ఒక దిండు అడ్డం పెట్టుకుని ఫోటోకి ఫోజులు ఇవ్వడమే. దీనిని ఆడవాళ్ళూ మగవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ చేసేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం ‘బీ ద రియల్‌ మాన్‌’ ఛాలెంజ్ హడావుడి కూడా గట్టిగానే నడుస్తోంది. 

ఎన్టీఆర్, చరణ్ లతో పాటు రాజమౌళి కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొనడం అంతే కాక ఎన్టీఆర్ విసిరినా చాలెంజ్ ని చిరంజీవి ఇప్పటికే అంగీకరించడంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ ఛాలెంజ్ సరిగా వర్కౌట్ కావడం లేదని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే చిరంజీవి విసిరినా ఛాలెంజ్ ఫెయిల్ అయింది. అయన ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరగా ఎవరూ ఆయన ఛాలెంజ్ స్వీకరించలేదు. ఇక ఇప్పుడు అదే పరిస్థితి మహేష్, ప్రభాస్ లు కూడా ఎదురయ్యేలా చేశారు, ఎందుకంటే. ఈ ఛాలెంజ్ మూడవ ఫేజ్ విఫలమయింది. ఎందుకంటే చిరు, వెంకీ, ఎన్టీఆర్ లు ఛాలెంజ్ చేసిన కొందరు హీరోలు దీనికి స్పందించలేదు. 

ముఖ్యంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ మహేష్, ప్రభాస్ కూడా దీన్ని లైట్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వెంకటేష్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి పూర్తి చేశాడు. అలాగే ఆయన మహేష్ ని ఈ ఛాలెంజ్ కి నామినేట్ చేయడం జరిగింది. మహేష్ ఈ ఛాలెంజ్ ని పట్టించుకోలేదు. మరోపక్క హీరో ప్రభాస్ ని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ నామినేట్ చేశారు. ప్రభాస్ సైతం ఈ ఛాలెంజ్ ని పట్టించుకోలేదు. మహేష్, ప్రభాస్ లు ఈ ఛాలెంజ్ ఎందుక్ పూర్తి చేయడం లేదో తెలియలేదు. వీరు కాక ఈ లిస్టులో నాగార్జున, బాలకృష్ణ, రవితేజ, వరుణ్ తేజ్ వంటి వారు కూడా ఈ లిస్టులో ఉండడం గమనార్హం.

More Related Stories