ఆచార్య నుండి ఆసక్తికర అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. ఈ మూవీకి సంభందించిన ప్రతి న్యూస్ ఇండస్ట్రీలో సెన్సెషన్ క్రియేట్ చేస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆచార్య సినిమాలో రామ్‌చరణ్ ఓ 30 నిమిషాలపాటు అతిథి పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో చిరు, చెర్రీ నెట్లో వినిపిస్తున్నట్టు తండ్రీకొడుకులుగా కాకుండా గురుశిష్యులుగా కనిపిస్తారని అంటున్నారు.
అది కాక ఇక సోషల్ మీడియాలో రామ్ చరణ్ పాత్ర పై రక రకాల వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆచార్యలో చరణ్ పాత్ర కొంచెం ఉద్వేగ పూరితంగా ఉంటుందని, ఈ సినిమాకి చరణ్ పాత్ర హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. అంతేకాక ఈ సినిమాలో దాదాపు అరగంట కనిపించనున్న చరణ్ పాత్ర ఆ తరువాత చనిపోతుందట. చరణ్ విలన్ల్స్ చేతిలో చంపబడతాడు అని, రామ్ చరణ్‌ను చంపిన వారి మీద ప్రతీకారంతో చిరంజీవి వారి మీద పోరుకు వెళ్తాడని అలా ఈ కధలో రకరకాల ట్విస్ట్ లు ఉంటాయని అంటున్నారు.