ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ హీరోయిన్ ఆమేనా ?

కియారా అద్వానీ మళ్లీ టాలీవుడ్‌కి వస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ తర్వాత బాలీవుడ్లో బిజీ అయిన ఈ భామ మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోందని అంటున్నారు. కియారా హిందీ అర్జున్ రెడ్డి హిట్‌తో బాలీవుడ్లో బిజీ అయ్యింది. అక్కడ వరుస అవకాశాలు అందుకుని సిద్ధార్థ్ మల్హోత్రా, అక్షయ్ కుమార్ లాంటి హీరోలతో సినిమాలు చేస్తోంది. అయితే ఇప్పుడీ భామ ఏకంగా ప్రభాస్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం మొదలయింది. నిజానికి ఒకరకంగా కియారా బాలీవుడ్లోనే కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ అక్కడ సరైన బ్రేక్ రాకపోవడం మహేశ్ బాబు 'భరత్ అనే నేను' సినిమా సూపర్ హిట్ అవడంతొహ్ ఇక్కడ సెటిల్ అవ్వాలని అనుకుంది. అయితే ఆ తరువాతా చేసిన వినయ విధేయ రామ భారీ దెబ్బ వేయడంతో మళ్ళీ బాలీవుడ్ వెళ్ళింది. అక్కడ అర్జున్ రెడ్డి రీమేక్ తో కియారాకి బ్రేక్ ఇచ్చాడు సందీప్ వంగ.
ఇక ఆమె అక్కడే అని ఫిక్స్ అవుతున్న తరుణంలో ప్రభాస్ సినిమాతో టాలీవుడ్‌కి రీ-ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నాడు. 200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతోన్నది. ఇక ఈ సినిమాలో కియారాని హీరోయిన్గా తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. కియారాకి తెలుగు, హిందీ రెండు చోట్ల ఇమేజ్ ఉంది కాబట్టి, సినిమాకి ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో ఈమెని హీరోయిన్గా సెలక్ట్ చేశారని అంటున్నారు.