English   

అక్షయ్ ని తీసుకొని ఇర్ఫాన్ ను ఇచ్చేయ్ దేవుడా.. నెటిజన్ ట్వీట్ పై హరీష్ శంకర్ ఫైర్..

Harish Shankar
2020-05-01 09:31:19

ఓ పక్క దేశం అంతా ఇద్దరు లెజెండరీ నటులు చనిపోయారు అని బాధ పడుతుంటే కొందరు బుర్ర లేని వాళ్ళు మాత్రం తమకు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఇర్ఫాన్ చనిపోవడంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే రచిత ఒక అభిమాని మాత్రం అక్షయ్ కుమార్‌ను తీసుకుని ఇర్ఫాన్ ఖాన్ తిరిగి పంపించండని ట్వీట్ చేసింది. దీనిపై ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు అక్షయ్ కుమార్‌ను తీసుకుని ఇర్ఫాన్ ఖాన్ తిరిగి పంపించండని చేసిన ట్వీట్‌కు ఓ నెటిజన్ స్పందిస్తూ.. 

మీకు అంతగా ద్వేషం కలిగేలా అక్షయ్ ఏం చేశారు..మోడికి మద్దతు చేయడం తప్పా.. ఆయన కష్టపడతారు, ఏడాదికి నాలుగు సినిమాలు చేసుకుంటారు.. ఆయన బతుకేదో ఆయన బతుకుతున్నారు. ఆయన తన కష్టంతోనే డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయినా సరే ఈ జనాలెందుకు ఆయన్ను అంతగా ద్వేషిస్తారని ట్వీట్ చేశాడు. ఇక ఇదే ట్వీట్ పై టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఫైర్ అయ్యాడు. అక్షయ్ కుమార్‌ను తీసుకుని ఇర్ఫాన్ ఖాన్ తిరిగి పంపించండని అంటున్నారు.. అది అంత సులభమా? ఒకవేళ అదే జరిగితే అలాంటి మైండ్ సెట్ ఉన్నందుకు ఎంతో మంది ఆమెను తీసుకెళ్లమని అనేవారు.. మొదటగా ఆమె ఇక్కడ ఉండేది కాదని కౌంటర్ వేశాడు. మొత్తానికి అక్షయ్ కుమార్ పై ఎలాంటి అసభ్యకరమైన ట్వీట్ చేయడం దారుణం అంటున్నారు ఆయన అభిమానులు. 

More Related Stories