English   

న‌సీరుద్ధీన్ షా ఆరోగ్యం...క్లారిటీ ఇచ్చిన కొడుకు

 Naseeruddin Shah
2020-05-01 09:44:49

బాలీవుడ్ స్టార్స్ ఇర్ఫాన్ ఖాన్, రిషీ క‌పూర్ ఒకరి వెంట ఒకరు మృత్యువాత ప‌డ‌డంతో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. సినీ ప‌రిశ్రమ‌కి ఆణిముత్యాల్లాంటి స్టార్స్‌కి కోల్పోయామ‌ని అందరూ చాలా బాధల్లో ఉన్నారు. అయితే జనాలు ఈ విషాదంలో ఉండగా బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ నటుడు న‌సీరుద్ధీన్ షాకి కూడా ఆరోగ్యం బాగోలేద‌ని, ఆసుప‌త్రిలో చేర్పించార‌ని ఆయన పరిస్థితి విషమంగా ఉందని పుకార్లు మొదలయ్యాయి. ఇక న‌సీరుద్ధీన్ ఆరోగ్యంపై స్పందించిన ఆయ‌న త‌న‌యుడు వియాన్ షా ఒక ట్వీట్ చేశారు. నాన్న ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలన్నీ ఫేక్, ఆయన బాగానే ఉన్నారు. ఇర్ఫాన్ భాయ్, చింటూజీల కోసం ప్రార్థనలు చేస్తున్నాం. వారిని బాగా మిస్ అవుతున్నాం. వారు లేని లోటు పూడ్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం'' అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో నసీరుద్దీన్ షా ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పడింది. ఇక న‌సీరుద్దీన్ కూడా త‌న ఫేస్ బుక్‌ పేజ్ లో ఈ విషయం మీద స్పందించారు. నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన వారంద‌రికి ధ‌న్యవాదాలు అని స్పష్టం చేశారు. న‌సీరుద్ధీన్ చివ‌రిగా ది హంగ్రీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చారు. 2017లో ఈ సినిమా విడుద‌లైంది. ఆ తరువాత ఆయన సినిమాలకి దూరంగా ఉంటున్నారు. 

More Related Stories