English   

ధాంక్యూ అంటున్న విక్రమ్ కుమార్

 Naga Chaitanya
2020-05-01 11:12:06

మజిలీ సినిమాతో చానళ్ళ తరువాత సూపర్ హిట్ కొట్టిన నాగ చైతన్య ఇప్పుడు లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నారు. శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా దెబ్బ గట్టిగా ఉన్నా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా తమ షూట్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కాబట్టి ఆపక తప్పని పరిస్థితి. అయితే ఆ విషయం ఎలా ఉన్నా ఇప్పుడు నాగచైతన్య తదుపరి ప్రాజెక్ట్ అంటూ ఒక సినిమా మీద చర్చ జరుగుతోంది. అదేమిటి అంటే ఇప్పటికే మనోడు బంగార్రాజు అనే సినిమా చేస్తున్నాడు, నాగార్జున లీడ్ రోల్ లో నటించే ఈ సినిమాలో ఈయన కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పరశురామ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది.  

ఇక ఇప్పుడు మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో ఒక సినిమా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. అది కూడా ఒక మంచి జోనర్ అని అంటున్నారు. ఇక నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ప్ర‌ముఖ ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు బి.వి.ఎస్.రవి కథను అందిస్తున్నాడని టాక్. అయితే ఈ సినిమాకి ‘థాంక్యూ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ప్ర‌చారం సాగుతోంది. అయితే ఈ జానర్ గురించి గతంలో ఒక ప్రచారం జరిగినా ఇప్పుడు ఈ సినిమా స్టోరీలైన్‌ మరింత ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. అదేంటంటే ఎవరైనా ఏ చిన్న సాయం చేసినా దానికి కృతజ్ఞత వ్యక్తం చేయడమన్నది మనిషి కనీస కర్తవ్యం’ అని నమ్మే ఓ యువకుడి చుట్టూ తిరిగే కథతో ఈ ‘థాంక్యూ’ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.  

More Related Stories