ట్రెండ్ మారుస్తున్న శేఖర్ కమ్ముల

హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి యూత్ ఫుల్ సినిమాలు చేసిన శేఖర్ కమ్ముల ఇప్పుడు ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. గత ఏడాది ఫిదా అంటూ వరుణ్ తేజ్, సాయి పల్లవిలతో ఫిదా చేసిన ఆయన ఆమధ్య ఒక సినిమా చేసి అవుట్పుట్ నచ్చక దానిని కిల్ చేసేసాడు. ఇక తాజాగా అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా ఆయన ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని అమిగోస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తవ్వ వచ్చింది. ఇది డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమకథ అని చెబుతున్నారు.
ఆయా విషయాలు ఎలా ఉన్నా చివరి దశలో ఉన్న చిత్రీకరణ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ విరామ సమయంలో శేఖర్ కమ్ముల తదుపరి సినిమాకి కథ సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. ఎప్పటిలా కాకుండా ఈ సినిమాని ఈ సారి లవ్ స్టోరీ పక్కన పెట్టి సప్పెన్స్ థ్రిల్లర్ ని తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ కహానీని శేఖర్ కమ్ముల అనామికగా తెరకెక్కించినా ఎమోషనల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయని ప్రేక్షకులు ఫీల్ అవడంతో అది ఇక్కడ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు శేఖర్ కమ్ముల తనదైన స్టైల్ లో ఒక థ్రిల్లర్ మూవీ ని రూపొందించనున్నారని అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో ?