English   

పుష్పకి ఆ విషయంలో కాంప్రమైజ్ అవుతున్న సుకుమార్

Pushpa
2020-05-01 13:10:17

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో పుష్ప అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ‌న్నీ లారీ డ్రైవర్ అని ముందు నుండి ప్రచారం జరిగింది. అయితే గంధపు చెక్కల స్మగ్లర్‌ గా కనిపించనున్నాడని పుష్ప సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాని బన్నీ కెరీర్ లో మొదటిసారిగా తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో అంటే ప్యాన్ ఇండియా మూవీగా విడుదల చేయ‌నున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న నేప‌థ్యంలో సౌత్‌, నార్త్ ఇండ‌స్ట్రీకి సంబంధించి ప‌లువురు ప్రముఖుల‌ని ఎంపిక చేశారని అంటున్నారు. ఈ సినిమా నుండి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తప్పూన్నరని ఆయన ప్లేస్ లో బాబీ సింహాని తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. 

ఈ విషయం మీద యూనిట్ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన ledhu కానీ ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అంశం బయటకొచ్చింది. పుష్పలో భారీ యాక్షన్ సీన్స్ ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ముందుగా భారీ ఫైట్, యాక్షన్ సీన్స్ ని హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ తో షూట్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేశారు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అక్కడి ఫైట్ మాస్టర్స్ ఇక్కడికి రాలేరు కాబట్టి పీటర్ హెయిన్ లేదా కనల్ కన్నణ్ తో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. షూటింగ్స్ ప్రారంభం అయిన తరువాత గ్యాప్ లేకుండా పుష్ప మూవీ చిత్రీకరణ జరపాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.

More Related Stories