English   

బాలయ్య అఘోరా పాత్ర నిజమే...తేల్చేసిన బోయపాటి

Balayya
2020-05-01 13:20:35

డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నిజానికి అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరిలోనే సెట్స్‌ పైకి వెళ్ళాల్సి ఉంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తి అయింది. ఇంతలో కరోనా దెబ్బ పడింది. దీంతో అన్ని సినిమాల లానే ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే ఈ సినిమా కధ ప్రకారం వారణాసిలో కూడా షూట్ చేయాల్సి ఉంది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో నటిస్తారని ఒక పాత్ర అఘోరా పాత్ర అని మరో పాత్ర నార్మల్ పాత్ర అని అంటున్నారు. 

ఇక ఈ అఘోరా పాత్రకు సంబందించి ఇప్పటి దాకా ప్రచారమే జరిగింది. అయితే దాని మీద బోయపాటి క్లారిటీ ఇచ్చారు. నిన్న ఎన్టీవీ లైవ్ లో మాట్లాడిన ఆయన తమ కాంబినేషన్ లో ఆడియన్స్ "సింహా" చూశారు. ఆ తర్వాత "లెజెండ్" చూశారు. ఈసారి అంతకుమించి కొత్తదనం చూపించాలని అందుకే వందశాతం కష్టపడ్డానని అన్నారు. కొత్తదనం కోసం క్యారెక్టరైజేషన్ నుంచి కథ చెప్పాలని నిర్ణయించుకున్నానని ఈ కొత్త సినిమాలో బాలయ్య మరింత కొత్తగా కనిపిస్తారని అన్నారు. ఇక అఘోరా విషయానికి వస్తే అఘోరా టైపు క్యారెక్టర్ ఉన్నమాట వాస్తవమేనన్న ఆయన దాన్ని ఎలా డిజైన్ చేశాం, ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అనేది చాలా ముఖ్యమని అన్నారు. కొత్తదనం కావాలంటే ఈమాత్రం ట్రై చేయాల్సిందనని ఆయన చెప్పుకొచ్చారు.

More Related Stories