మహేష్ బాబు లైనప్ మామూలుగా లేదుగా...

వరుస విజయాలతో సూపర్ స్టార్ ఫామ్ ఉన్నాడు. మొన్న సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో మరో బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నేకేవ్వరు సినిమాల హిట్స్ తో ఫాంలో ఉన్నాడు ఆయన. ఇక మహేష్ సినిమా సినిమాకి వసూళ్లు పెంచుకోవాలని చూస్తుంటాడు కానీ సినిమాల మధ్య గ్యాప్‌ని మాత్రం పట్టించుకోడు. ఏడాదికో సినిమా, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాకే మరో ప్రాజెక్ట్ అన్నట్లు కాల్షీట్స్ ఇస్తు నిధానమే ప్రధానం అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తుంటాడు. కానీ ఈ ఏడాదితో ఆ పద్ధతి మారనుందని అంటున్నారు. నిజానికి మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మరో సినిమా స్టార్ట్ చెయ్యలేదు. ఈ లోపు లాక్‌డౌన్‌తో ఇండస్ట్రీ మొత్తం ఇంటికే పరిమితమైంది. అయితే ఈ లాక్డౌన్ తర్వాత మహేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మూవీస్ చేస్తాడనే టాక్ వస్తోంది.
ఇప్పటికే పరశురామ్‌తో సినిమాకి సిద్ధమైన మహేశ్, మరో మూడు ప్రాజెక్టలని లైనప్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ తో సినిమా తీస్తానని ప్రకటించాడు రాజమౌళి. 'ట్రిపుల్ ఆర్' పూర్తవ్వగానే మహేశ్‌తో సినిమా స్టార్ట్ చేస్తానని అనౌన్స్ చేశాడు. మరోవైపు వంశీ పైడిపల్లి కూడా మహేశ్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడు. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత వీళ్లిద్దరి కాంబోలో సినిమా రావాల్సింది. కానీ ఏవో కారణాలతో ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు మహేశ్‌ని ఇంప్రెస్ చెయ్యడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఇక అర్జున్‌రెడ్డితో స్టార్ డైరెక్టర్ అయిపోయిన సందీప్ వంగా కూడా మహేశ్ బాబు కోసం కథ సిద్ధం చేస్తున్నాడట. లాక్డౌన్ కంప్లీట్ అవ్వగానే స్టోరీ నెరేషన్ ఉంటుందని సమాచారం. అర్జున్‌రెడ్డి తర్వాత వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తుందని ప్రచారం జరిగింది. కానీ స్టోరీ సెట్ అవ్వలేదు. సో ఈ లైనప్ చూస్తే లాక్డౌన్ పీరియడ్‌లో మహేష్ స్పీడ్ పెంచినట్టే కనిపిస్తోంది.