English   

భర్త మరణంపై ఇర్ఫాన్ ఖాన్ భార్య ఎమోషనల్ పోస్ట్.. 

Irrfans wife Sutapa
2020-05-01 17:53:00

విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులే కాదు అభిమానులు కూడా అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన లేడనే విషయాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. ఇక ఇర్ఫాన్ తనయులు బాబిల్, అయాన్ అయితే తండ్రి చనిపోయిన బాధలో కనీసం మాట్లాడలేకపోతున్నారు. నాన్నలా కాకుండా స్నేహితుడిలా ఇర్ఫాన్ ఉండేవాడని భార్య సుపాత కూడా చెబుతుంది. చనిపోయే ముందు నుంచి కూడా తను లేకుండా ఎలా ఉండాలో ఇర్ఫాన్ ముందుగానే వాళ్లను సిద్ధం చేసి ఉంచాడు. తన చావును ముందే ఊహించాడు కూడా ఈయన. ఇక ఇప్పుడు ఇర్ఫాన్ ఖాన్ భార్య సుతప సిక్దర్‌ సోషల్‌ మీడియాలో తన భర్తతో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ భావోద్యేగానికి లోనయింది. దాంతో పాటు ఎమోషనల్ లెటర్ కూడా రాసుకొచ్చింది. నా భర్తని నేను కోల్పోలేదు.. ఆయన నాతోనే ఉన్నారు అంటూ సుతప పెట్టిన పోస్ట్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. ఇన్నాళ్లు ఇర్ఫాన్‌కి అండగా నిలిచిన కుటుంబ సభ్యులు ఇప్పుడు మరింత ధైర్యంతో ముందుకు సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడిన ఇర్ఫాన్ కొద్ది రోజులు విదేశాల్లో ఉన్నాడు.. రెండేళ్ల తర్వాత ఇండియాకు వచ్చి సినిమాలు కూడా చేసాడు. అయితే ఉన్నట్లుండి మళ్లీ అనారోగ్యం పాలై రెండు రోజుల్లోనే పరిస్థితి విషమించి మరణించాడు. ఈయన అంత్యక్రియలు ముంబైలోని వెర్సోవా కబ్రస్థాన్‌లో జరిగాయి. 

More Related Stories