English   

మహేష్ బాబుకు తల్లిగా రేణు దేశాయ్.. మరి పవన్ ఫ్యాన్స్..

 Renu Desai
2020-05-01 18:06:40

ఏమో వినడానికి కూడా విచిత్రంగానే అనిపిస్తుంది కదా.. కానీ ఇప్పుడు స్వయంగా ఈ విషయాన్ని రేణు దేశాయ్ చెప్పేసరికి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. పవన్ తో విడిపోయిన తర్వాత ఈమె సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాల్లోనూ బిజీగా ఉంది. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా పిల్లలతో గడుపుతున్న రేణు దేశాయ్.. అప్పుడప్పుడూ అభిమానులతో మాట్లాడుతుంది. అందులో భాగంగానే మరోసారి లైవ్ లోకి వచ్చిన రేణు దేశాయ్.. చాలా విషయాల గురించి క్లారిటీ ఇచ్చింది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో తనను కొందరు అడుగుతున్నారని.. అవకాశం ఇస్తామంటున్నారని చెప్పింది. అయితే నచ్చిన పాత్రల కోసం చూస్తున్నట్లు చెప్పింది రేణు. 

ఇదిలా ఉండగా మీకు తల్లి పాత్రలు ఇష్టమేనా.. ఇస్తే చేస్తారా.. ప్రభాస్, మహేష్ బాబు లాంటి వాళ్లకు తల్లిగా నటించడానికి ఒప్పుకుంటారా అని నెటిజన్ అడిగాడు. దానికి రేణు కూడా చాలా సింపుల్ గా సమాధానం చెప్పింది. తనకు తల్లి పాత్రలు వస్తే చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది రేణు. హీరోల చిన్నప్పటి తల్లి పాత్రలు చేయడానికి సరే.. దర్శకులకు నమ్మకం ఉండి.. తనను ముసలి లుక్ లో కూడా బాగానే చూపిస్తారనుకుంటే మహేష్ బాబు లాంటి హీరోలకు తల్లిగా నటించాలని ఉందని చెప్పింది రేణు. అతడి కంటే 7 ఏళ్లు చిన్నది రేణు.. కానీ మహేష్ బాబుకు అమ్మగా నటించాలని చెప్తుంది. గతంలో సుస్వాగతం హీరోయిన్ దేవయాణి నాని సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా నటించింది. ఇప్పుడు స్క్రిప్ట్ కుదిరితే రేణు కూడా మహేష్ బాబుకు అమ్మ అవుతుందేమో..? 

More Related Stories