English   

బాలయ్య.. నువ్వు దేవుడు స్వామి..

nbk
2020-05-02 07:29:17

ఇప్పుడు నందమూరి బాలకృష్ణ చేసిన పని చూసి అభిమానులు కూడా ఇదే అంటున్నారు. పైకి కోపంగా కనిపిస్తాడు.. అభిమానులను కొడతాడు అని నెగిటివ్ కామెంట్ చేస్తారు.. కానీ బాలయ్య మనసు నిజంగానే బంగారం. ఒకసారి ఆయన రియల్ క్యారెక్టర్ తెలిస్తే ఎవరు అతని కామెంట్ చేయరు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే బాలకృష్ణ స్పందిస్తాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. కరుణ లేని కరోనా వైరస్ భారతదేశ ఆర్ధిక వ్యవస్థను దారుణంగా దెబ్బ తీస్తుంది. లాక్ డౌన్ నిబంధన మేరకు.. దేశంలో రైళ్లు బస్సులు విమానాలు ఎక్కడిక్కడ స్థంభించి జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల వేల కోట్ల నష్టం కూడా వస్తుంది. అంతే కాదు ఎంతో మంది తమ ఉపాధి కోల్పోయి ఆకలి కేకలు పెడుతున్నారు. ఈ వైరస్ మహామ్మారిపై ఇదివరకే బాలకృష్ణ స్పందించాడు.. ఇంతకు ముందు ప్రపంచంలో ఇలాంటి కల్లోల పరిస్థితిని ఎపుడు చూడలేదని.. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపాడు.

ఎలాంటి కష్ట సమయంలో అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పాడు బాలయ్య. ఈ క్రమంలోనే తన హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసాడు. తాజాగా బాలకృష్ణ సమాజం కోసం తన హిందూపూర్ నియోజకవర్గం కోసం తన వంతు కృషి చేస్తున్నారు. ఇవే కాకుండా హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని కూడా చూసుకుంటున్నాడు. ఈరోజు ఆయన ఆసుపత్రిలోని కరోనా పేషేంట్లతో సమయం కుదిరినప్పుడల్లా వచ్చి మాట్లాడుతున్నాడు. అంతేగాక కరోనా ఉన్నంత కాలం పేషేంట్లకు మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చాడు. ఇక తాజాగా మరోసారి బాలకృష్ణ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆయన ఆసుపత్రిలోని విధులు నిర్వహిస్తున్న 400మంది హౌస్ కీపింగ్ సభ్యులకు విరాళం అందించారు. దీనిపై ఆసుపత్రి సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

More Related Stories