పవన్ హీరోయిన్ ను చూస్తుంటే గుండెజారి గల్లంతయ్యిందే..

కొందరు హీరోయిన్లు స్టార్ హీరోలతో నటించినా కూడా కొన్నిసార్లు అస్సలు క్రేజ్ తెచ్చుకోరు. వాళ్లకు ఎన్ని సినిమాలు చేసినా కూడా గుర్తింపు మాత్రం రాదు. అలాంటి ముద్దుగుమ్మల్లో ముందు వరసలో ఉంటుంది కృతి కర్బందా. తెలుగులో పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లాంటి హీరోలతో నటించినా కూడా ఈమె జాతకం మాత్రం మారలేదు. పదేళ్లుగా తెలుగులో ట్రై చేసినా కూడా సరైన గుర్తింపు రాలేదు. కన్నడలో స్టార్ అయినా కూడా తెలుగులో మాత్రం అస్సలు ఈ బ్యూటీని పట్టించుకోలేదు మన దర్శక నిర్మాతలు. అందాల ఆరబోతకు సిద్ధంగా ఉన్నా.. అక్క పాత్రలకు సెటిలైపోయినా కృతికి అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. చివరికి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కూడా ఏం చేయలేకపోయేసరికి ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది ఈ ముద్దుగుమ్మ.
గ్లామర్ షో లో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు కృతికర్బందా. ఇప్పటికీ హీరోయిన్ గా వెలిగిపోదామనే ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. అయితే విచిత్రంగా టాలీవుడ్ పొమ్మన్నా.. బాలీవుడ్ మాత్రం రారమ్మని ఆహ్వానం పలుకుతుంది. అక్కడ వరస సినిమాలతో రప్ఫాడిస్తుంది ఈ భామ. 2019లో హౌజ్ ఫుల్ 4, పాగల్ పంటి లాంటి సినిమాలు చేసింది కృతి. ఇప్పటికీ అక్కడ అవకాశాల కోసం చూస్తూనే ఉంది కృతి. ఇప్పుడు కూడా ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఉల్లిపొర కంటే పలుచగా ఉండే దుస్తుల్లో కనిపిస్తుంది. ఇక మధ్యలో ఫోటోషూట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కించింది ఈ బ్యూటీ. మరి అక్కడ ఇంకెంతకాలం కెరీర్ నడిపిస్తుందో చూడాలిక. ఇంత చేసినా కూడా సౌత్ మాత్రం కృతి వైపు అస్సలు చూడటం లేదు.