English   

పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన బోనీ కపూర్..

pk
2020-05-02 07:56:34

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ కరోనా వైరస్ కానీ లేకపోయుంటే ఈపాటికి వకీల్ సాబ్ ట్రైలర్ కూడా వచ్చి ఉండేది. మే 15న సినిమా విడుదల అయి ఉండేది. కానీ అవేవీ జరగలేదు. దానికి కారణం లాక్ డౌన్.. ఈ సినిమా ఇంకా షెడ్యూల్ ఒకటి బ్యాలెన్స్ మిగిలి ఉంది. దాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేస్తామని చెబుతున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అంతే వేగంగా సినిమా కూడా విడుదల చేస్తామని హామీ ఇస్తున్నాడు నిర్మాత దిల్ రాజు.

కానీ మరో నిర్మాత బోనీ కపూర్ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేశాడు. ఈయన తాజాగా విడుదల చేసిన ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ చూసిన తర్వాత అభిమానులు నిరుత్సాహంలో మునిగిపోయారు. ఈ లాక్ డౌన్ అయిపోయే వరకు తన సినిమా అప్డేట్స్ నేను చెప్పను మీరు అడగొద్దు అటు అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదల చేసాడు. ఇందులో పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా ఈ సినిమాకు నిర్మాత కాబట్టి. ప్రస్తుతానికి ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే విషయం కూడా చెప్పలేము అంటున్నాడు బోనీ కపూర్. పవన్ కళ్యాణ్ సినిమా కూడా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనేది క్లారిటీగా చెప్పలేకపోతున్నాడు. దాంతో అభిమానులు కంగారు పడుతున్నారు. దిల్ రాజు ఒక విధంగా.. బోనికపూర్ మరో విధంగా చెప్పడంతో ఏది నిజమో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు పవన్ అభిమానులు.

More Related Stories