English   

పవన్ కళ్యాణ్ కూతురు మల్టీ టాలెంటెడ్.. ఇదిగో సాక్ష్యం..

pk1
2020-05-02 08:12:08

పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కానీ ఆయన కూతురు ఆద్యా గురించి మాత్రం చాలామందికి తెలియదు. ఎక్కువగా బయటికి కూడా రాదు.. సోషల్ మీడియాలో కనిపించదు. అందుకే పవన్ కూతురు ఎలా ఉంటుంది ఏం చేస్తుంది అనే విషయాలపై చాలామందికి క్లారిటీ లేదు. అయితే ఈ చిన్నారి కూడా తన తల్లిదండ్రుల లాగే మల్టీ టాలెంటెడ్. ఈ వయసులోనే ఒక షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేసి నటించింది. దాన్ని రేణు దేశాయ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం అన్ని ఆద్య చేసింది అంటూ రాసుకొచ్చింది రేణు దేశాయ్. ఇందులో డాక్టర్ గా పేషెంట్ గా ద్విపాత్రాభినయం చేసింది ఆద్య. ఇది చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

అన్నింటికీ మించి ఆద్య నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. ఎక్స్ ప్రెషన్స్ కూడా అద్భుతంగా ఇచ్చింది. దాంతో కచ్చితంగా త్వరలోనే వెండితెరపై కూడా పవన్ కళ్యాణ్ కూతురు కనిపిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. కానీ రేణు దేశాయ్ మాత్రం తన పిల్లలు కేరాఫ్ పవన్ కళ్యాణ్ లా కాకుండా సొంతంగా ఎదగాలని చెబుతోంది. అఖిరా నందన్, ఆద్యకు కూడా అదే ఇష్టమని చెబుతోంది రేణు. ఏదేమైనా కూడా పవన్ కూతురు చేసిన షార్ట్ ఫిలిం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

More Related Stories