English   

అలాంటి అమ్మాయి కావాలంటున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda
2020-05-02 12:59:55

అన్ని విషయాల్లో తను డిఫెరెంట్ అని ప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు విజయ్ దేవరకొండ. చేసే సినిమాలు మొదలు వేసే డ్రెస్ లు, మొన్నటి మిడిల్ క్లాస్ ఫండ్ దాకా అన్నీ విభిన్నంగానే ఉండేలా ప్లాన్ చేస్తాడు ఈ హీరో. అయితే ఆయన ఓ జాతీయ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు అనే విషయంతో సహా పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఆయన పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా ఇదివరకు పెళ్లి గురించి కుటుంబ సభ్యులెవరూ అడిగేవారు కాదని కానీ ఎందుకో ఈ మధ్య పెళ్లి ప్రస్తావన తీసుకొస్తున్నారని విజయ్ చెప్పుకొచ్చాడు. 

ఇక తనకు ఫ్యా మిలీ లైఫ్‌ చాలా ఇష్టమన్న విజయ్ పెళ్లి, పిల్లలు... ఈ బంధాలన్నీ జీవితానికి ఓ సార్థకతగా భావిస్తానని చెప్పుకొచ్చాడు. తప్పకుండా పెళ్లి చేసుకునే రోజు వస్తుందని అయితే దానికి మరికాస్త సమయం తీసుకోవాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ఇక వ్యక్తిగా మరింత పరిణితి సాధించిన తర్వాత పెళ్లి గురించి సీరియస్‌గా ఆలోచిస్తానని వైవాహిక జీవితంలో గొప్ప బాధ్యత ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. ఒకరినొకరు అర్థం చేసుకుం టూ బంధాన్ని వృద్ధి చేసుకోవాల్సిన అవశ్యకత అవసరమవుతుందని ఆయన చెప్పుకొచ్చాడు. 

ఇక అమ్మాయిల్లో సెన్సాఫ్‌ హ్యూమర్‌తో పాటు దయార్ధ్ర స్వభావం ఉన్న వారినే ఎక్కువగా ఇష్టపడతానని విజయ్ చెప్పుకొచ్చాడు. నన్ను ఎప్పుడూ నవ్వించగలిగే అమ్మాయి ని కోరుకుంటానని ఆయన చెప్పుకొచ్చాడు. లాక్‌డౌన్‌ టైమ్‌లో వారితో కలిసి ఉన్నా బోర్‌ ఫీలింగ్‌ రావొద్దని ఆమె సమక్షంలో ప్రతిరోజు ఓ హాలీడేలా గడచిపోవాలని ఆయన చెప్పుకొచ్చాడు. 

More Related Stories