English   

అసలు విషయం తెలియక అలియా మీద విరుచుకుపడుతున్న నెటిజన్లు

 Alia Bhatt
2020-05-02 13:12:03

సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది ఈ రోజుల్లో సర్వ సాధారణం అయిపొయింది. నిజానికి ఒక రకంగా సామాన్యులే ఈ దెబ్బకు భయపడుతుంటే ఇక సెలబ్రిటీల సంగతి ఎలా ఉంటుందో ? మనకి అర్ధం అవుతుంది. తాజాగా ఈ ట్రోలింగ్ బారిన ఒక హీరోయిన్ పడింది. అది కూడా తన తప్పు లేకుండానే. విషయం ఏంటంటే రెండ్రోజుల క్రితం బాలీవుడ్ దిగ్గజం రిషి కపూర్ మరణించారు. అయితే ఆయన అంతిమ సంస్కారాలు చాలా కొద్ది మంది మధ్యలో జరిగాయి. ఆ అంతిమ సంస్కారాలకు హాజరయిన అలియా భట్ ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఆ అంత్యక్రియలను ఆమె మొబైల్ తో వీడియో తీస్తున్నట్టు ఉండడమే. 

నిజానికి రిషి కపూర్‌ మరణవార్త విన్నప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉంది ఆలియా భట్. రణ్‌బీర్ కపూర్, అలాగే నీతూ కపూర్‌ లని ఓదార్చుతూ అన్ని పనులు దగ్గరుండి ఆమె చూసుకుంది. అయితే ఆమె ఫోన్ వాడింది అనే విషయాన్ని మాత్రమె కొందరు గమనించి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అయితే అసలు ఆమె ఫోన్ ఎందుకు వాడింది అనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రిషి కపూర్ కూతురు రిధిమా కపూర్ ఫ్యామిలీ ఢిల్లీలో నివాసం ఉంటుంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఈమె తండ్రి అంతిమ సంస్కారానికి రిధిమా రాలేకపోయింది. 

విమానయానం సహా రోడ్డు మార్గం కూడా రాష్ట్రాలు మూసివేయడంతో ఆమె ముంబైలో జరుగుతున్న అంత్యక్రియలకు హాజరుకాలేక పోయింది. దీంతో రణ్‌బీర్ హిందు సంప్రదాయం ప్రకారం కర్మకాండలు నిర్వహించేటప్పుడు రిధిమకి వీడియో కాల్‌ చేసిందట ఆలియా. ఈ కార్యక్రమాలన్నింటిని లైవ్‌ కాల్‌ లో చూపించి ఆమెకు కొంతలో కొంత హాజరు కాలేదనే బాధ కలగకుండా చేసింది. అయితే ఈ విషయం తెలియని నెటిజన్లు ఆలియాపై విమర్శలు చేస్తున్నారనే నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

More Related Stories