ఏకంగా మహేష్ నే పడేసిన వింక్ బ్యూటీ

ఈ యేడాది మొదట్లోనే సంక్రాంతికి మహేష్ బాబు-అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కూడా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత సినిమాగా మహేష్ పరుశురామ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ముందు వంశీ పైడిపల్లి తో సినిమా ఉంటుందని అనుకున్నా కారణాలు ఏవయినా కానీ ఆ ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టారు. నిజానికి పరశురామ్ తో సినిమా ఇప్పటికే లాంచ్ కావాల్సి ఉన్నా అది కుదరలేదు.
ఇక ఈ సినిమా కరోనా ఎద్దడి తగ్గాక కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంచించాలని ప్లాన్ చేస్తున్నారు. అది వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేది ఈమె అంటూ జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, కీర్తి సురేష్ ఇలా పలువురు భామల పేర్లు చెప్పుకొస్తున్నారు. తాజాగా వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ పేరు కూడా లిస్టులో చేసింది.
ఒకే ఒక్క కన్నుగీటుతో కోట్లాది మంది హృదయాలని గెలుచుకున్న మల్లూ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమాకి కథానాయికగా ఎంపికైందని అంటున్నారు. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపనట్టు చెబుతున్నారు. అయితే ఇదే కనుక నిజమైతే ప్రియా ప్రకాశ్ నక్క తోక తొక్కినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు మంచి ఆఫర్స్ ఏమీ లేవు. ఇప్పటికే ప్రియా ప్రకాశ్..తెలుగులో నితిన్ సరసన ఓ సినిమా చేస్తుంది. ఇప్పుడు ఏకంగా మహేష్ తో సినిమా అంటే నక్కతోక తోక్కినట్టే మరి.