English   

పూజిత పొన్నాడ హాట్ షో.. తెలుగమ్మాయికి ఇప్పటికైనా బ్రేక్ వస్తుందా..

 Poojitha Ponnada
2020-05-02 17:06:16

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తుంది ఓ తెలుగమ్మాయి. రంగస్థలం సినిమాలో ఆది ప్రియురాలిగా నటించిన ముద్దుగుమ్మ గుర్తుండే ఉంటుంది. తన పేరు పూజిత పొన్నాడ.. పదహారణాల అచ్చ తెలుగమ్మాయి. రంగస్థలం తర్వాత దర్శకుడు, వేర్ ఈజ్ వెంకటలక్ష్మి లాంటి సినిమాల్లో నటించింది. పూజిత షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ పెద్ద సినిమాల వైపు అడిగేసింది. తెలుగమ్మాయే అయినా కూడా అందాలు ఆరబోయడంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు పూజిత. దాంతో దర్శక నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మ వైపు బాగానే చూస్తున్నారు. ఈ మధ్య బాగానే అవ‌కాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్యే హ‌వీష్ హీరోగా వ‌చ్చిన సెవెన్ సినిమాలో న‌టించింది పూజిత‌. 

అయితే ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో ఈ భామ కెరీర్ ఎటూ కాకుండా పోతుంది. అయినా కూడా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఇప్పుడు అవకాశాలు బాగానే వస్తున్నాయని.. ఒకప్పటిలా మన దర్శక నిర్మాతలు పరభాషా హీరోయిన్ల వైపు చూడటం లేదని.. నాకు తెలుగు అమ్మాయి కావాలి అని అడిగే రోజులు వచ్చేశాయని చెబుతోంది పూజిత పొన్నాడ. దాంతో తన లాంటి తెలుగు అమ్మాయిలకు ఇంకా చాలా అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అన్నట్టు ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో  ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పటికే ఈ పాట చిత్రీకరణ పూర్తి అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరి పవన్ కళ్యాణ్ సినిమాతో అయినా పూజిత కోరుకున్న బ్రేక్ వస్తుందా లేదా అనేది చూడాలి. 

More Related Stories