English   

మరో సినిమా ఫైనల్ చేసిన పవన్...దర్శకుడు ఎవరెంటే 

Pawan
2020-05-02 17:51:46

ఇక సినిమాలే చేయను ఇక జీవితం ప్రజలకి అంకితం అని చాలా సార్లు చెప్పిన పవన్ ఇప్పుడు ఏకంగా వరుసగా మూడు సినిమాలు ఒప్పుకుని తన అభిమానులకే కాక సినీ ప్రియులకు కూడా షాకిచ్చారు. ఆయన రీఎంట్రీ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకోగా వేసవి కానుకగా మే 15న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా దెబ్బకు ఆ ప్లాన్ అంతా అప్సెట్ అయిందనుకోండి. ఇక ఈ సినిమా కాక ఆయన క్రిష్ డైరెక్షన్ లో ఒక పీరియాడిక్ మూవీ కూడా చేస్తున్నారు. ఇక అది కాక హరీష్ శంకర్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు పవన్. అయితే ఆయన మరో దర్శకుడికి కూడా అవకాశం ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆయనెవరో కారు పవన్ తో గతంలో రెండు సినిమాలు చేసిన డాలీ.

గతంలో పవన్ - డాలీ కాంబినేషన్ లో 'గోపాల గోపాల' 'కాటమరాయుడు' సినిమాలు వచ్చాయి. ఇందులో మొదటిది బానే ఆడినా రెండోది దెబ్బ వేసింది. అయినా సరే ఆయన మీద ఉన్న నమ్మకంతో ఇప్పుడు మరో సినిమా చేయడానికి ఛాన్స్ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇదే కనుక నిజమైతే ఇది వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమా అవుతుంది. నిజానికి ఎప్పుడో నాలుగేళ్ల క్రితమే దాస‌రి నారాయ‌ణ‌రావు నిర్మాణంలో ప‌వ‌న్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే అప్పుడు ఈ సినిమాకి డాలీనే అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఎస్‌జే సూర్య త‌ప్పుకోవ‌డంతో ఆయన కాట‌మ‌రాయుడు చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్ళకి డాలీ చెప్పిన కధ పవన్ కి నచ్చిందని స్క్రిప్ట్ పూర్తి చేయమని చెప్పారని అంటున్నారు.

More Related Stories