English   

పుకార్లు ఎక్కువైపోతున్నాయి.. చరణ్ చూస్కో మరి..

 ram charan
2020-05-02 18:29:24

ఎందుకో తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాపై రోజుకో రూమర్ బయటికి వస్తుంది. ముఖ్యంగా మొన్నామధ్య త్రిష ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆమె క్రియేటివ్ డిఫెరెన్సులు అనే కారణం చెప్పి తప్పుకుంది.. చిరంజీవి మాత్రం మణిరత్నం సినిమా కారణంగా తప్పుకుందని కవర్ చేసాడు. ఆ తర్వాత ఆచార్య నుంచి ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కూడా తప్పుకున్నాడు. ఈయన కూడా మరో సినిమా ఉందని.. అందుకే తప్పుకోవాల్సి వచ్చిందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్ వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు మొదలవుతుందనేది కూడా పక్కాగా చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే ఈ చిత్రం నుంచి ఇప్పుడు హీరోయిన్ కాజల్ కూడా తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

త్రిష స్థానంలో కాజల్ ను తీసుకుంటే.. ఇఫ్పుడు ఈమె కూడా చిరుకు హ్యాండిచ్చిందని ప్రచారం జరుగుతుంది. అసలు కాజల్ ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకుందనే అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనికి భారతీయుడు 2 సమాధానం అని తెలుస్తుంది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఒకేసారి ఈ రెండు సినిమాలకు డేట్స్ క్లాష్ అవుతుండటంతో కచ్చితంగా చిరంజీవి సినిమాను వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తుంది. అయితే ఇవన్నీ నిజాలా లేదంటే రూమర్స్ అనేది అర్థం కావడం లేదు. దీనిపై నిర్మాత రామ్ చరణ్ క్లారిటీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. మరోవైపు చిరంజీవి మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్నాడు కానీ ఈ విషయాలపై మాత్రం మాట్లాడటం లేదు. కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. 

More Related Stories