English   

ఇర్ఫాన్ ఖాన్ చివరి కోరికపై నీళ్లు చల్లిన లాక్‌డౌన్..

irfankhan
2020-05-02 20:24:57

బాలీవుడ్ స్టార్ ఇర్ఫాన్ ఖాన్ చనిపోయి వారం రోజులకు దగ్గర పడుతున్నా కూడా ఇంకా ఆయన్ని మర్చిపోలేకపోతున్నారు అభిమానులు. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు అయితే ఆయనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు ఈయన చనిపోయిన తర్వాత ఆయనేం చివరి రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డాడనేది ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మరణం తప్పదని తెలిసిన తర్వాత ఇర్ఫాన్ ఖాన్ పడిన మానసిక క్షోభ కన్నీరు పెట్టించేదని చెబుతున్నారు సన్నిహితులు. ఆయనకు చివర్లో చాలా మందిని కలిసి మాట్లాడాలని అనిపించేదని స్నేహితులు చెబుతున్నారు. హాస్పిటల్లో ఉన్నపుడు కూడా చాలా మందితో కలిసి తనకు సాయం చేసిన వాళ్లను.. తన కెరీర్ ను మార్చేసిన వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఇర్ఫాన్ ఎంతగానో ప్రయత్నించాడు.

కానీ లాక్ డౌన్ అన్నింటిపై నీళ్లు చల్లేసింది. బాలీవుడ్ లో తన స్నేహితులను కలవాలని.. చివరి రోజుల్లో వాళ్లతో సరదాగా గడపాలని.. ఇంట్లోనే పెద్ద పార్టీ ఒకటి ఏర్పాటు చేసి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలనుకున్నాడు అయితే ఇవేవీ తీరకుండా చేసింది కరోనా వైరస్.. లాక్‌డౌన్. చివరికి అంత గొప్ప నటుడు చనిపోతే ఈ రెండింటి వల్ల కనీసం కడసారి చూపుకు కూడా నోచుకోకుండా అంత్యక్రియలు జరిగాయి. మొత్తానికి ఇర్ఫాన్ బతికున్న రోజుల్లో మాత్రం చాలా మందిని కలిసి మాట్లాడాలి అనుకున్నాడు అయితే అది కుదరకుండానే పైకి వెళ్లిపోయాడు పాపం.

More Related Stories