English   

లాక్‌డౌన్‌లో సడలింపు.. నితిన్, నిఖిల్ పెళ్లి జరుగుతుందా..?

nithin
2020-05-03 07:32:18

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే మరీ.. ఎన్నో ఏళ్లుగా పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నలు అడిగించుకుని.. తీరా ఆ సమయం వచ్చిన తర్వాత ఎక్కడో చైనా నుంచి వచ్చిన మాయదారి కరోనాతో నితిన్, నిఖిల్ పెళ్లిళ్లు ఉన్నఫలంగా ఆగిపోయాయి. దాంతో ఆకాశమంత పందిరి.. భూదేవంత చాప అన్నీ వేస్ట్ అయిపోయాయి. అన్నీ ఆపేసి ఎంచక్కా ఇంటికే పరిమితం అయిపోయారు నితిన్, నిఖిల్. అయితే ఇప్పుడు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్ తో ఈ హీరోల పెళ్లిళ్ళలపై మళ్లీ టాక్స్ మొదలైపోయాయి. ఒకప్పుడు అనుకున్నట్లు ఘనంగా మాత్రం జరగదు కానీ కచ్చితంగా జరుగుతుందనే ప్రచారం అయితే జరుగుతుంది. తమ వాళ్లకు మాత్రమే చెప్పుకుని సందడి లేకుండా పెళ్లి తంతు కానిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

లాక్ డౌన్ చివరి దశకు వచ్చేయడం.. కేంద్రం కూడా పెళ్లి చేసుకునే వాళ్లకు కాస్త ఉపశమనం కలిగించేలా చెప్పడంతో నితిన్, నిఖిల్ పెళ్లి త్వరలోనే జరగబోతుందని తెలుస్తుంది. గ్రీన్ జోన్లతో పాటు కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో 50 మంది వరకు పెళ్లికి హాజరైతే చేసుకోవచ్చని తెలిపింది కేంద్రం. అయితే పెళ్లికి హాజరు అయ్యేవారంతా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. ఇక పెళ్లికి వచ్చిన వారంతా భౌతిక దూరం పాటించాలని సూచించింది. ఇవన్నీ పాటిస్తూ పెళ్లి చేసుకుంటే నో ప్రాబ్లమ్ అంటుంది కేంద్రం. దాంతో ఇప్పుడు నితిన్, నిఖిల్ కూడా ఇదే ఆలోచిస్తున్నాయి. అయితే వీళ్ల కుటుంబ సభ్యుల సంఖ్యే 50 దాటుతుంది. ఇండస్ట్రీ కూడా వస్తే లెక్క కోటలు దాటిపోతుంది. ఇలాంటి సమయంలో ఇన్నేసి ఆంక్షల మధ్య మన హీరోలు ఇప్పుడు పెళ్లి చేసుకుంటారా లేదంటే అన్నీ కుదిరిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటారా అనేది చూడాలిక.

More Related Stories