English   

రాజ్ తరుణ్ కెరీర్‌ను కరోనా గ్రహణం కమ్మేసిందిగా..

raj
2020-05-03 07:40:54

అసలే వరస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ కెరీర్ కు ఇప్పుడు కరోనా శాపంగా మారింది. లాక్ డౌన్ కారణంగా విడుదల కావాల్సిన సినిమా ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయాడు ఈయన. కనీసం రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా చేసిన సినిమా కావడం.. ఇఫ్పుడు కరోనాకు బలి కావడంతో ఏం చేయాలో అర్థం కాని విపత్కర పరిస్థితుల్లోకి వెళ్లిపోయాడు ఈయన. ఉదయ్ కిరణ్ మాదిరే హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీకి వచ్చాడు రాజ్ తరుణ్. నాగార్జున నిర్మించిన ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్.. సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. కానీ ఆ తర్వాత మాత్రమే ఆయనకు అనుకున్న విజయాలు రాలేదు. వరుసగా పరాజయాలు రావడంతో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా పడిపోయాడు ఈ కుర్రహీరో. గత కొన్నేళ్లుగా వరస ఫ్లాపులు ఇస్తున్న రాజ్ తరుణ్ ఇప్పుడు మరో డిజాస్టర్ ఇచ్చాడు. కెరీర్ పూర్తిగా ముగింపు దశలో ఉన్నప్పుడు దిల్ రాజు నిర్మాణంలో ఇద్దరి లోకం ఒకటే సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమా రావడంతో కనీసం రాజ్ తరుణ్ మళ్లీ హిట్ కొట్టి తనను తాను నిరూపించుకుంతాడని ఆశించారు అభిమానులు.

జి ఆర్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అత్యంత దారుణంగా డిజాస్టర్ అయిపోయింది. రాజ్ తరుణ్ కెరీర్లో ఇప్పటి వరకు ఏ సినిమాకు రానంత నెగిటివ్ టాక్ ఈ సినిమాకు వచ్చింది. ఈ సినిమా తర్వాత అసలు మనోడు కనిపించడమే మానేసాడు. అయితే ఇలాంటి సమయంలో కూడా మరో అప్పుడెప్పుడో నాగచైతన్య హీరోగా ఒక లైలా కోసం సినిమా చేసిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఒరేయ్ బుజ్జిగా అంటూ వచ్చాడు రాజ్ తరుణ్. మాళవిక నాయర్‌ ఇందులో హీరోయిన్. కెకె.రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మార్చ్ 25న విడుదల కావాల్సిన ఈ సినిమా కాస్తా ఇప్పుడు ఆగిపోయింది. చివరికి నేరుగా ఓటిటిలో విడుదల చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అందులో నిజం లేదని నిర్మాతలు తెలిపారు. కానీ రేపు విడుదలైనా కూడా థియేటర్స్ దొరుకుతాయా అనేది కూడా పెద్ద సమస్యగా మారిపోయింది. మొత్తానికి కరోనాతో పూర్తిగా రాజ్ తరుణ్ కెరీర్ చివరికి వచ్చేసిందన్నమాట.

More Related Stories