English   

పెళ్లి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుబ్బరాజు

subbaraj
2020-05-03 09:49:38

టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా తన కంటూ మంచి గుర్తింపు సంపాదించారు నటుడు సుబ్బరాజు. ఓ వైపు నెగటివ్ రోల్స్ చేస్తూనే మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మంచి పాత్రలను చేస్తూ వస్తున్నాడు. బాహుబలి లాంటి సినిమాలు చేస్తూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. అయితే ఆయన వయసు ఏమీ తక్కువ కాదు. ఆయన వయసు పెరిగిపోతున్నా ఆయన పెళ్లి జోలికి మాత్రం వెళ్లడ లేదు. అయితే ఇప్పుడు సుబ్బరాజు పెళ్లి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

దానికి కారణం తన పెళ్లి గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమే. ఈ మధ్యనే ఒక ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఇప్పటిదాకా పెళ్లి చేసుకోక పోవడానికి గల కారణం ఏమిటనే దానిని చెప్పుకొచ్చాడు. పెళ్లి చేసుకోవాలంటే దానికి కేవలం వయసు మాత్రమే ఆధారం కాదని... 25 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకోవాలని అందరూ అనుకుంటారు కాబట్టి నేను కూడా అలా చేసుకోవాలి అనుకోవడం సరికాదని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక జీవిత భాగస్వామికి తాను బెస్ట్ ఇవ్వగలను లోటు రాకుండా చూసుకో గలనని నాకు అనిపించినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెబుతూ సుబ్బరాజు తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. చూద్దాం మరి ఈయన ఎన్నేళ్ళకి పెళ్లి చేసుకుంటారో ?

 

More Related Stories